దిశ హత్యాచారం కేసులో పారిపోతున్న నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా... పోలీసులు చేసిన పని పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. కాగా... తాజాగా తెలంగాణలోని బీజేపీ నేతలు కూడా ఈ ఘటనపై స్పందించారు. 

శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు నిందితులను సీన్ రీకన్ స్ట్రక్షన్ కోసం.. దిశను చంపి బడూది చేసిన స్థలానికి తీసుకువెళ్లారు. అక్కడ నిందితులు పారిపోవడానికి ప్రయత్నించడంతో... పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

AlsoRead దిశ హత్య కేసు... అసలు ఏం జరిగింది..?...

దీనిపై బీజేపీ నేత కృష్ణ సాగర్ రావు మాట్లాడుతూ... సామూహిక అత్యాచారం, హత్య అనేవి భయంకరమైన నేరమన్నారు. బీజేపీ వాటిని ఎప్పుడూ ప్రోత్సహించదని.. దిశ హత్య ఘటనను తాము ఖండిస్తున్నట్లు చెప్పారు. అయితే.. ఓ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పార్టీగా..  తాము అధికార పార్టీ పై నిందితులకు న్యాయం చేసేలా ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు.

ఈ ఎన్ కౌంటర్ విషయంలో... ముందుగా తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు మీడియా ముందుకు రావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ డీజీపీ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించాలన్నారు. భారత దేశం బనానా రిపబ్లిక్ కాదని చెప్పారు. పోలీసులు మీడియా ముందుకు వచ్చి ప్రకటన ఇచ్చిన తర్వాతే తాము ఈ ఘటనపై స్పందిస్తామని చెప్పారు.

కేంద్రంలోని చాలా మంది బీజేపీ నేతలు మాత్రం తెలంగాణ పోలీసులు చేసిన పనిని మెచ్చుకుంటుూ ఉండటం గమనార్హం. బీజేపీ ఎంపీ రాజ్యవర్థన్ రాథోడ్.. తెలంగాణ పోలీసుల నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. 

మరో బీజేపీ నేత షైనా ఎస్సీ ఈ ఘటనపై ట్విట్టర్ లో స్పందించారు. నలుగురు రేపిస్ట్ లను దిశను చంపిన ప్రాంతంలోనే ఎన్ కౌంటర్ చేశారు. నేచురల్ జస్టిస్ అంటూ ట్వీట్ చేశారు. 

ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ స్వర్ణజిత్ సేన్ కూడా స్పందించారు. ‘ఇది ప్రొఫిఫనల్ కాకపోయినప్పటికీ...  ఊహించినదే జరిగంది... ఇలా జరుగుతుందని నేను ముందుగానే ఊహించాను’ అని పేర్కొన్నారు.