బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
హైదరాబాద్: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
భార్గవ్ రామ్ బెంగుళూరులో తలదాచుకొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. హాపీజ్‌పేటలో ఉన్న భూ వివాదమే ఈ కిడ్నాప్ నకు కారణంగా పోలీసులు తేల్చారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.
also read:బోయినపల్లి కిడ్నాప్: గాంధీ ఆసుపత్రిలో అఖిలప్రియకు వైద్య పరీక్షలు పూర్తి
ఈ భూ వివాదంలో భాగంగానే బోయిన్ పల్లిలోని ప్రవీణ్ రావుతో పాటు ఆయన ఇద్దరు సోదరులను దుండగులు మంగళవారం నాడు రాత్రి కిడ్నాప్ చేశారు.బుధవారం నాడు ఉదయం కిడ్నాపర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కిడ్నాప్ కుట్ర వెనుక భూమా అఖిలప్రియ దంపతులు ఉన్నారని హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్ తెలిపారు.
కిడ్నాపర్లను అరెస్ట్ చేసిన తర్వాత నుండి భార్గవ్ రామ్ ఆచూకీ లేకుండా పోయారు. తొలుత ఆయనను కూడ అదుపులోకి తీసుకొన్నారని ప్రచారం సాగింది. కానీ ఆయన తమ అదుపులో లేడని బుధవారం నాడు సాయంత్రం పోలీసులు ప్రకటించారు.భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
