అమరావతి: బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో అరెస్టైన ఏపీకి చెందిన మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు  గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారుమంగళవారం నాడు రాత్రి బోయిన్‌పల్లిలోని ప్రవీణ్ రావు తో పాటు ఆయన ఇద్దరు సోదరులను ఐటీ అధికారులంటూ వచ్చిన కొందరు కిడ్నాప్ చేశారు.

also read:బోయిన్‌పల్లి కిడ్నాప్ కేసులో భూమా దంపతులదే కీలకపాత్ర: హైద్రాబాద్ సీపీ అంజనీకుమార్

ఈ విషయమై బాధిత కుటుంబం నుండి అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.  అదే సమయంలో నార్సింగ్ సమీపంలో ఈ ముగ్గురిని వదిలిపెట్టారు.

కిడ్నాప్ చేసిన  నిందితులను పోలీసులను వికారాబాద్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం నాడు ఉదయం కూకట్‌పల్లిలో అరెస్ట్ చేసిన  భూమా అఖిలప్రియను బేగంపేట మహిళా పోలిస్ స్టేషన్ కు తరలించారు. బేగంపేట పోలీస్ స్టేషన్ లో ప్రశ్నించారు. ఆ తర్వాత  ఆమెను వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సుమారు గంటకు పైగా వైద్య పరీక్షలు నిర్వహించారు.

వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత గాంధీ ఆసుపత్రి నుండి  మేజిస్టేట్ ముందు ఆమెను హాజరుపర్చనున్నారు.