Mobile Reviews | Xiaomi 12 Pro:త్వరలోనే ఇండియాలో లాంచ్.. చైనీస్ వెర్షన్ వంటి ఫీచర్లతో వచ్చేస్తోంది..
షియోమీ 12 ప్రొ ఇండియన్ వేరియంట్ ఫీచర్స్ గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, అయితే షియోమీ 12 ప్రొ భారతీయ వెర్షన్ కూడా చైనీస్ వెర్షన్ లాగానే అదే ఫీచర్లతో అందించబడుతుందని భావిస్తున్నారు.
భారతదేశంలో షియోమీ (Xiaomi) కొత్త ఫోన్ షియోమీ 12 ప్రొ (Xiaomi 12 Pro) లాంచ్ ధృవీకరించింది, అయితే లాంచ్ తేదీ ఇప్పటికీ రహస్యంగా ఉంది. షియోమీ 12 ప్రొ ఈ నెలలో ఇండియాలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. షియోమీ 12 ప్రొ గత సంవత్సరం డిసెంబర్‌లో చైనాలో షియోమీ 12 సిరీస్ క్రింద ప్రారంభించారు. ఈ సిరీస్ కింద రెండు ఫోన్‌లు Xiaomi 12, Xiaomi 12X రానున్నాయి. షియోమీ 12 ప్రొ 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో వస్తుంది. అంతేకాకుండా, ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
షియోమీ భారతదేశంలో షియోమీ 12 ప్రో లాంచ్ గురించి ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. షోస్టాపర్ అనే ట్యాగ్‌లైన్‌తో షియోమీ ఈ ఫోన్ టీజర్‌ను విడుదల చేసింది. కొన్ని ఇతర లీకైన నివేదికలు కూడా ఫోన్ ఏప్రిల్‌లో భారతదేశంలో లాంచ్ అవుతుందని పేర్కొంది. షియోమీ 12 ప్రొ భారతీయ ఫీచర్స్ గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, అయితే షియోమీ 12 ప్రొ భారతీయ వెర్షన్ కూడా చైనీస్ వెర్షన్ వంటి ఫీచర్లతో అందించబడుతుందని భావిస్తున్నారు.
షియోమీ 12 ప్రొ స్పెసిఫికేషన్లు
MIUI 13 షియోమీ 12 ప్రొలో అందించారు. 1440x3200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.73-అంగుళాల WQHD+ E5 AMOLED డిస్‌ప్లే ఉంది. డిస్ ప్లే బ్రైట్ నెస్ 1,500 నిట్స్. ఇందులో డిస్ ప్లే రక్షణ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ లభిస్తుంది. ఆపిల్ ప్రీమియం ఐఫోన్‌లలో ఉపయోగించే తక్కువ ఉష్ణోగ్రత పాలీక్రిస్టలైన్ ఆక్సైడ్ (LTPO) బ్యాక్‌ప్లేన్ టెక్నాలజీ దీనిలో ఇచ్చారు. షియోమీ 12 ప్రొలో స్నాప్ డ్రాగన్ Snapdragon 8 Gen 1 ప్రాసెసర్, 12జిబి LPDDR5 ర్యామ్, 256జిబి స్టోరేజ్ ఆప్షన్ ఇచ్చారు.
షియోమీ 12 ప్రోలో మూడు కెమెరాలు ఇచ్చారు. మొదటి లెన్స్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX707 సెన్సార్. దీంతో ఓఐఎస్‌కు సపోర్ట్ ఉంటుంది. రెండవ లెన్స్ కూడా 50 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్, మూడవ లెన్స్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 5G, 4G LTE, Wi-Fi 6E, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, ఇన్‌ఫ్రారెడ్ (IR), USB టైప్-C పోర్ట్ ఉన్నాయి. స్పీకర్‌తో డాల్బీ అట్మోస్ అండ్ హార్మన్ కార్డన్‌లకు సపోర్ట్ ఉంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 4600mAh బ్యాటరీ ఉంది. దీనితో పాటు, 50W వైర్‌లెస్ అండ్ 10W రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కూడా ఉంది.