Asianet News TeluguAsianet News Telugu

కొత్త సంవత్సరం నుండి ఈ స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ పనిచేయదు.. మీ ఫోన్ కూడా ఉందా లేదో లిస్ట్ చూడండి..

ప్రతి సంవత్సరం వాట్సాప్‌ ఎన్నో పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్ట్ నిలిపివేస్తుంది. సపోర్ట్ నిలిపివేయడం అంటే కొన్ని డివైజెస్ లకు WhatsApp కొత్త అప్ డేట్స్ విడుదల చేయబడవు.

Whatsapp will not work in these smartphones from this new year is your phone  also included see full list here
Author
First Published Dec 27, 2022, 7:54 PM IST

మీరు ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ని ఉపయోగిస్తున్నారా... అయితే మీకో చేదు వార్త. నిజానికి డిసెంబర్ 31 తర్వాత, వాట్సాప్‌ చాలా స్మార్ట్‌ఫోన్‌లలో పనిచేయడం ఆగిపోతుంది. మీ ఫోన్ కాలం చెల్లిన ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంటే వాట్సాప్ అందులో పనిచేయడం ఆగిపోవచ్చు. కొత్త సంవత్సరం నుంచి 49 స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్ సపోర్ట్ చేయదు. ఈ ఫోన్లలో యాపిల్ ఐఫోన్ కూడా ఉంది. 
 
ప్రతి సంవత్సరం వాట్సాప్‌ ఎన్నో పాత ఆపరేటింగ్ సిస్టమ్‌లకు సపోర్ట్ నిలిపివేస్తుంది. సపోర్ట్ నిలిపివేయడం అంటే కొన్ని డివైజెస్ లకు WhatsApp కొత్త అప్ డేట్స్ విడుదల చేయబడవు. ప్రీ ఇన్‌స్టాల్ చేసిన యాప్ పని చేస్తూనే ఉంటుంది కానీ అప్‌డేట్‌లు లేకపోవడం వల్ల యాప్ కొత్త ఫీచర్‌లను పొందలేరు ఇంకా సెక్యూరిటీ రిస్క్ కూడా ఉంటుంది.

ఈ సంవత్సరం కూడా అంటే డిసెంబర్ 31 నుండి చాలా స్మార్ట్‌ఫోన్‌లలో వాట్సాప్‌ సపోర్ట్ నిలిపివేయబడుతుంది. ఒక నివేదికలో ఈ స్మార్ట్‌ఫోన్‌ల లిస్ట్ కూడా విడుదల చేయబడింది. ఈ లిస్ట్ లో ఆపిల్, స్యామ్సంగ్ నుండి హువేయి వరకు ఫోన్‌లు ఉన్నాయి. 

ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు

ఆపిల్ ఐఫోన్ 5
ఆపిల్ ఐఫోన్ 5సి
హెచ్‌టి‌సి డిజైర్ 500
హువేయి అసెండ్ D
హువేయి అసెండ్ D1
హువేయి అసెండ్ D2
హువేయి అసెండ్ G740
హువేయి అసెండ్ Mate
హువేయి అసెండ్ P1
లెనోవా A820
ఎల్‌జి ఎనాక్ట్
ఎల్‌జి లూసిడ్ 2
ఎల్‌జి ఆప్టిమస్ F3Q
ఎల్‌జి ఆప్టిమస్ F3
ఎల్‌జి ఆప్టిమస్ F5
ఎల్‌జి ఆప్టిమస్ F6
ఎల్‌జి ఆప్టిమస్ F7
ఎల్‌జి ఆప్టిమస్ L2 II
ఎల్‌జి ఆప్టిమస్ L3 II
ఎల్‌జి ఆప్టిమస్ L5
ఎల్‌జి ఆప్టిమస్ L7
ఎల్‌జి ఆప్టిమస్ L4 II
ఎల్‌జి ఆప్టిమస్ L5 II
ఎల్‌జి ఆప్టిమస్ L7 II
ఎల్‌జి ఆప్టిమస్ 4X HD
ఎల్‌జి ఆప్టిమస్ L4 II డ్యూయల్
ఎల్‌జి ఆప్టిమస్ L5 డ్యూయల్
ఎల్‌జి ఆప్టిమస్ L3 II డ్యూయల్
ఎల్‌జి ఆప్టిమస్ నైట్రో HD
ఎల్‌జి ఆప్టిమస్ L7 II డ్యూయల్
శామ్‌సంగ్ గెలాక్సీ Ace 2
శామ్‌సంగ్ గెలాక్సీ కోర్
శామ్‌సంగ్ గెలాక్సీ s2
శామ్‌సంగ్ గెలాక్సీ Trend II
శామ్‌సంగ్ గెలాక్సీ ట్రెండ్ లైట్
శామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 2
శామ్‌సంగ్ గెలాక్సీ s3 Mini
గ్రాండ్ S ఫ్లెక్స్ ZTE
గ్రాండ్ X క్వాడ్ V987 ZTE
సోనీ ఎక్స్‌పీరియా మీరో
సోనీ ఎక్స్‌పీరియా ఆర్క్స్
సోనీ ఎక్స్‌పీరియా నియో ఎల్
మరికొన్ని ఇతర ఫోన్లు కూడా ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios