వాట్సాప్ మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది.. ఇప్పుడు ఒకేసారి 4 డివైజెస్‌లో వాట్సాప్‌ ఎలా ఉపయోగించాలంటే..

కంపెనీ ప్రకారం, టెస్ట్ డిప్లాయ్‌మెంట్ తర్వాత వెబ్ బ్రౌజర్ ద్వారా నేరుగా ఈ ఫీచర్‌ను ఉపయోగించే వినియోగదారుల సంఖ్య పెరిగిందని తెలిపింది. ల్యాప్‌టాప్‌లలో పని చేసే లేదా కమ్యూనికేషన్ కోసం వాట్సాప్ ని ఉపయోగించే కస్టమర్‌లకు ఈ ఫంక్షనాలిటీ ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. మీ ఫోన్‌ను కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా మీ కంప్యూటర్ నుండి వాట్సాప్ మెసేజెస్ పంపడానికి, పొందడానికి అనుమతిస్తుంది.

WhatsApp Multi-Device Feature Out Of Beta Mode: How To Use WhatsApp On 4 Devices At Once

సోషల్ మీడియా దిగ్గజం మెటా(facebook) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల కోసం గత కొన్ని నెలలుగా బీటాలో మల్టీ-డివైజ్ ఫంక్షనాలిటీ పరీక్షిస్తోంది. ఇప్పుడు బీటా టెస్టింగ్ నుండి కంపెనీ మల్టీ-డివైస్ ఫంక్షనాలిటీ వచ్చేసింది. దీంతో ఈ ఫీచర్ స్టాండర్డ్ వెర్షన్‌లో అందుబాటులో ఉంటుంది. బీటా వెర్షన్ లో ఉన్నప్పుడు, వినియోగదారులు ఈ ఫీచర్‌ని ఉపయోగించాలా వద్దా అనే ఆప్షన్ ఉండేది. అయితే, ఇప్పుడు, WhatsApp మల్టీ-డివైజ్ సపోర్ట్ స్టేబుల్ వర్షన్ విడుదల ప్రారంభమైంది, ఇకపై ఈ ఫీచర్ ఆప్షన్ కాకుండా వినియోగదారులందరికీ ఆటోమేటిక్ గా ఆక్టివ్ చేయబడుతుంది. ఇప్పుడు వాట్సప్ లోకి లాగిన్ అయిన ప్రతిసారీ స్మార్ట్‌ఫోన్‌ను కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండా, ఒకేసారి నాలుగు వేర్వేరు డివైజెస్ లో WhatsAppని ఉపయోగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

బీటా రోల్‌అవుట్ నుండి వెబ్ బ్రౌజర్ ద్వారా నేరుగా ఫీచర్‌ను యాక్సెస్ చేసే వారి సంఖ్య పెరిగిందని కంపెనీ తెలిపింది. ల్యాప్‌టాప్‌పై పనిచేసే లేదా వాట్సాప్‌లో ఏ విధమైన కమ్యూనికేషన్‌ చేసే వినియోగదారులకు ఈ ఫీచర్ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక మీ ఫోన్‌ను కనెక్ట్ చేయడం గురించి చింతించాల్సిన అవసరం లేకుండా నేరుగా మీ కంప్యూటర్‌లో  WhatsApp మెసేజెస్ పంపడం, పొందడం సులభం చేస్తుంది.

బీటా నుండి వస్తున్న ఈ ఫీచర్ గురించి మెటా యాజమాన్యంలోని వాట్సాప్ నుండి ఎటువంటి ప్రకటన లేనప్పటికీ , వినియోగదారులు మల్టీ డివైజ్  ఫంక్షనలిటి బీటా టెస్టింగ్ లో లేదని చెబుతున్నారు. మల్టీ-డివైస్ సపోర్ట్‌ని ఉపయోగిస్తున్నప్పుడు WhatsApp నుండి “బీటా” ట్యాగ్ ఇప్పుడు పోయిందని  వెల్లడిస్తున్నారు, అంటే ఈ ఫీచర్ బీటా టెస్టింగ్ నుండి బయటపడిందని, స్టేబుల్ బిల్డ్‌లో విడుదల చేయబడిందని అర్థం.

మల్టీ డివైజ్  సపోర్ట్ వినియోగదారులను  ఫోన్‌లో ఇంకా  నాలుగు ఇతర డివైజెస్ లో WhatsAppని ఉపయోగించడానికి అనుమతిస్తుంది. అంటే ఒకే WhatsApp ఖాతాను రెండు వేర్వేరు స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించలేరు, కానీ  ఒకేసారి WhatsApp వెబ్‌తో నాలుగు కంప్యూటర్లు లేదా టాబ్లెట్‌లలో కనెక్ట్ చేయవచ్చు. ఇంతకుముందు, వాట్సాప్‌ను ఉపయోగించడం కొనసాగించడానికి వినియోగదారులు  ఫోన్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేసి ఉంచుకోవాలి. ఇకపై అలా కాదు వినియోగదారులు తమ ఫోన్‌ను ఇంటర్నెట్‌కి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే వాట్సాప్ వెబ్‌ను ఉచితంగా ఉపయోగించవచ్చు.

 వాట్సాప్‌ని నాలుగు డివైజెస్ వరకు ఎలా కనెక్ట్ చేయాలంటే
ఈ ఫీచర్‌ని ఉపయోగించడానికి, మీరు వెబ్ బ్రౌజర్ నుండి www.web.whatsapp.comకి వెళ్లాలి. ఇక్కడ మీరు స్క్రీన్‌పై QR కోడ్‌ని చూస్తారు.
తర్వాత, మీరు మీ ఫోన్‌లో WhatsAppని ఓపెన్ చేసి, స్క్రీన్ కుడి వైపున మూలలో ఉన్న మూడు-చుక్కల మెనుని క్లిక్ చేయాలి.
లింక్ ఏ డివైజెస్ పై క్లిక్ చేసి, ఆపై "link A device" పై క్లిక్ చేయండి.
ఇప్పుడు, మీ స్క్రీన్‌పై QR కోడ్‌ని స్కాన్ చేయండి ! అంతే ఇక మీరు మీ ఫోన్ గురించి మరచిపోవచ్చు అలాగే ఇతర డివైజెస్ లో ఉచితంగా WhatsAppని ఉపయోగించవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios