Asianet News TeluguAsianet News Telugu

ఎక్కువ ఫార్వర్డ్‌ చేస్తే ‘వాట్సాప్‌’ ఇలా అలర్ట్ చేస్తుంది!

మెసేజింగ్ వేదిక ‘వాట్సాప్’ నుంచి పరిమితిని మించి మెసేజ్‌లు పంపితే బూడిద రంగులో డబుల్‌ యారోలతో కూడిన అలర్ట్ సందేశం వస్తుంది. మరీ పరిమితి పెంచితే ట్యాప్ అనే సందేశం కూడా వస్తూ ఉంటుంది. 

WhatsApp Can Tell Users When A Message Forwarded Many Times
Author
New Delhi, First Published Aug 3, 2019, 2:59 PM IST

న్యూఢిల్లీ: మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ నిత్యం కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తుంది. నకిలీ వార్తలను కట్టడి చేయడానికి గతేడాది తెచ్చిన ‘ఫార్వర్డ్’ ఫీచర్‌లో మరిన్ని మార్పులు తేవడానికి ప్రయత్నిస్తోంది. వాట్సాప్‌లో ఒక మెసేజ్‌ ఎక్కువసార్లు ఫార్వర్డ్ చేస్తే అది యూజర్‌కు తెలిసే విధంగా వాట్సాప్‌ ఓ కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 

‘ఫ్రీక్వెంట్లీ ఫార్వర్డ్‌’ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ ఫీచర్‌తో చాలాసార్లు ఫార్వడ్‌ చేసిన మెసేజ్‌ను సులభంగా గుర్తించొచ్చు. 
ఎక్కువ సార్లు ఫార్వడ్‌ చేసిన మెసెజ్‌లు ‘రెండు బాణాలతో కూడిన ప్రత్యేక చిహ్నం’తో కనిపిస్తాయి. యూజర్లు తమ మెసేజ్‌ను ఇతరులకు తరచుగా ఫార్వడ్‌ చేస్తే యూజర్‌కు నోటిఫికేషన్‌ కూడా వస్తుంది.

ఐదు కంటే ఎక్కువసార్లు మెసేజ్ ఫార్వడ్‌ చేసినప్పుడు మాత్రమే ఈ లేబుల్‌ కనబడుతుంది. వాట్సాప్ ‘ఫార్వర్డ్’ లేబుల్‌కు అదనంగా 'ట్యాప్‌'ను అందుబాటులోకి తెచ్చింది. మెసేజ్‌లు సుదీర్ఘంగా ఉంటే యూజర్‌ దానిని చదివేందుకు వీలుగా 'ట్యాప్‌' ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. 


ముఖ్యంగా గ్రూప్ చాట్స్‌లో యూజర్‌ అనుభూతిని దృష్టిలో పెట్టుకొని దీన్ని రూపొందించినట్టు వాట్సాప్ ప్రతినిధి తెలిపారు. వాట్సాప్ ప్రవేశపెట్టిన కొత్త ఫీచర్లతో నకిలీ వార్తలను గుర్తించడం, అసత్య ప్రచారాలు వ్యాప్తించకుండా ఆపడం తేలిక అవుతుంది. వాట్సాప్ గ్లోబల్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ మాట్లాడుతూ ఈ ఏడాది చివరికల్లా తన చెల్లింపు సేవ ‘వాట్సాప్ పే’ను భారతదేశంలో ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 

కాగా, వాట్సాప్ భారతదేశంలో 400 మిలియన్ల క్రియాశీల కస్టమర్లను కలిగి ఉంది. దాంతోపాటు ఒకే మెసేజ్‌ను అప్పటికే చాలాసార్లు ఫార్వర్డ్‌ చేసి, మళ్లీ చేయాలనుకున్న ప్రతిసారి వాట్సాప్‌ ఓ నోటిఫికేషన్‌ను చూపుతుంది. దాంతోపాటు బూడిద రంగులో డబుల్‌ యారో కనిపిస్తుంది. 

వాట్సాప్ కంపెనీ వర్గాలు తెలిపిన ప్రకారం ‘ఇప్పటికే చాలాసార్లు ఈ మెసేజ్‌ను ఫార్వర్డ్‌ చేశారని గుర్తించేలా ఓ మెసేజ్‌ను చూపుతుంది’ అని తెలిపాయి. అయితే ఎన్నిసార్లు దాన్ని పంపారన్న సంఖ్యను మాత్రం చూపించదని వాట్సాప్ అధికార వర్గాలు వివరించాయి.

Follow Us:
Download App:
  • android
  • ios