Tempered Glass: టెంపర్డ్ గ్లాస్ వాడుతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

సాధారణంగా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు మనం చేసే మొదటి పని ఏమిటంటే, ఫోన్ స్క్రీన్‌పై టెంపర్డ్ గ్లాస్‌ను వేయించడం. ఇది మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌కు ఎలాంటి డామెజ్ కాకుండా రక్షిస్తుంది. అయితే కొన్ని టెంప‌ర్డ్ గ్లాస్‌లు ఫోన్‌కు ర‌క్ష‌ణ ఇవ్వ‌లేవు.
 

What is Tempered Glass Used for

నేడు స్మార్ట్‌ఫోన్ అత్యవసరమైన వస్తువుగా మారిపోయింది. ఇప్పటి డిజిటల్ యుగంలో చాలా పనులను స్మార్ట్‌ఫోన్ ద్వారానే చక్కబెడుతుంటాం. ప్రతి పనికి ఎక్కువగా వాటిపైనే ఆధారపడతున్నాం. ఇంత ముఖ్యమైన దానిని జాగ్రత్తగా కాపాడుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంటుంది. ముఖ్యంగా ఫోన్ స్క్రీన్‌కు ఎలాంటి నష్టం కలగుకుండా కాపాడుకోవాలి. సాధరణంగా అయితే స్క్రీన్‌కు నష్టం జరగకుండా టెంపర్డ్ గ్లాస్‌ వెస్తుంటాం. అయితే ఏది పడితే ఆ టెంపర్డ్ గ్లాసెస్ వేయడం వల్ల ఫోన్‌కు చాలా నష్టం జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

సాధరణంగా స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు మనం చేసే మొదటి పని ఏమిటంటే, ఫోన్ స్క్రీన్‌పై టెంపర్డ్ గ్లాస్‌ను వేయడం. ఇది మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌కు ఎలాంటి డామెజ్ కాకుండా రక్షిస్తుంది. ఫోన్ పడిపోయినప్పడు కీ స్క్రీన్ పగిలిపోకుండా చేస్తుంది. కానీ కొన్ని టెంపర్డ్ గ్లాసెస్ వల్ల మీ ఫోన్ ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది.

మీరు మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై టెంపర్డ్ గ్లాస్‌ను ఇన్‌స్టాల్ చేయాలనుకుంటే, ఎప్పుడూ సన్నని గాజుతో కూడిన టెంపర్డ్ గ్లాస్‌ను తీసుకోకండి. సన్నని గ్లాస్‌తో ఉన్న టెంపర్డ్ గ్లాస్ మీ డిస్‌ప్లే‌కు పూర్తి రక్షణను అందించదు. థిన్ టెంపర్డ్ గ్లాస్ ఉన్న మీ ఫోన్ పడిపోతే టెంపర్డ్ గ్లాస్ తో పాటు ఫోన్ డిస్ ప్లే కూడా పగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి.. ఎల్లప్పుడూ మీ స్మార్ట్‌ఫోన్ కోసం బ్రాండెడ్ టెంపర్డ్ గ్లాస్‌ని ఎంచుకోండి. అది మందంగా ఉంటుంది. మీ ఫోన్ డిస్‌ప్లే లేదా స్క్రీన్‌ను రక్షించడానికి ఖచ్చితంగా పని చేస్తుంది. నాణ్యమైన టెంపర్డ్ గ్లాస్‌ను ఇన్‌స్టాల్ చేయడం ద్వారా మీ ఫోన్‌లో టచ్ కూడా బాగా పని చేస్తోంది. కొన్ని టెంప‌ర్డ్ గ్లాస్‌లు మ‌నం వాడే స్మార్ట్‌ఫోన్‌కు స‌రైన ర‌క్ష‌ణ ఇవ్వ‌లేవు. కాబ‌ట్టి టెంప‌ర్డ్ గ్లాస్ విష‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుంటే మంచిది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios