ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్‌లో బెడ్‌రూమ్‌లు.. వాషింగ్ మెషీన్ ఇంకా స్లిప్పర్స్ కూడా.. మొదలైన విచారణ..

ఇప్పుడు వీటన్నింటి మధ్య బెడ్‌లు, ఫ్యూటాన్ కౌచెస్, షీట్‌లు అండ్ దిండులతో సోఫాలు, వాషింగ్ మెషీన్‌ల ఫోరోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి.

Washing Machine To Slippers, Here's What Office Bedrooms At Twitter Headquarters Look Like

మైక్రో బ్లాగ్గింగ్ ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ శాన్ ఫ్రాన్సిస్కో హెడ్ క్వాటర్స్ లో కొంత ఆఫీస్ స్థలాన్ని బెడ్‌రూమ్‌లుగా మార్చారు. నిజానికి, ఈ మార్పు  కొత్త హార్డ్‌కోర్ వర్క్ ఎథిక్స్ కింద పని చేస్తు అలసిపోయిన సిబ్బంది కోసం ఏర్పాటు చేశారు. ఈ బెడ్‌రూమ్‌లు సోషల్ మీడియా యూజర్లను మాత్రమే కాకుండా శాన్ ఫ్రాన్సిస్కో బిల్డింగ్ ఇన్‌స్పెక్షన్ డిపార్ట్‌మెంట్ దృష్టిని కూడా ఆకర్షించింది, ఈ  బిల్డింగ్ కేవలం కమర్షియల్ వర్క్ కోసం మాత్రమే రిజిస్టర్ చేయబడినందున కంపెనీ పై విచారణ కూడా ప్రారంభించింది.

ఇప్పుడు వీటన్నింటి మధ్య బెడ్‌లు, ఫ్యూటాన్ కౌచెస్, షీట్‌లు అండ్ దిండులతో సోఫాలు, వాషింగ్ మెషీన్‌ల ఫోరోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఒక న్యూస్ రిపోర్టర్ ఈ బెడ్‌రూమ్‌ల ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు, ఇందులో కొద్దిపాటి ఫర్నిచర్‌తో బెడ్‌రూమ్‌లు కనిపించాయి.

జేమ్స్ క్లేటన్ పోస్ట్ చేస్తూ క్యాప్షన్‌లో  బి‌బి‌సి ట్విట్టర్ లోపలి ఫోటోలను తీసింది, ఇవి ఉద్యోగులు నిద్రించడానికి బెడ్‌రూమ్‌లుగా మార్చబడిన గదులు. శాన్ ఫ్రాన్సిస్కో సిటీ దీనిపై దర్యాప్తు చేస్తోంది ఎందుకంటే ఇది వాణిజ్యపరమైనది భవనం." అంటూ పోస్ట్ చేశాడు.

జేమ్స్ క్లేటన్ బెడ్‌రూమ్‌లోని వార్డ్‌రోబ్‌తో సహా మరికొన్ని ఫోటోలను పోస్ట్ చేసారు. రెండవ గదిలో సోఫా సింగిల్ బెడ్‌గా మారుతున్నట్లు చూపిస్తుంది.  

ఫోర్బ్స్ నివేదిక ప్రకారం, భవనంలోని ప్రతి అంతస్తులో దాదాపు నాలుగు నుండి ఎనిమిది బెడ్‌రూమ్ పాడ్స్ లు ఉన్నాయి. రూంలో పాత పరుపులు, కర్టెన్లు, పెద్ద కాన్ఫరెన్స్ రూమ్ టెలిప్రెసెన్స్ మానిటర్లు కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాదు, ఒక గదిలో నారింజ కార్పెట్, ఒక చెక్క టేబుల్, ఒక క్వీన్ బెడ్, టేబుల్ ల్యాంప్, రెండు ఆఫీసు కుర్చీలు కూడా ఉన్నాయి. 

విచారణలో  ఎలోన్ మస్క్ ఆఫీస్ 
Twitter శాన్ ఫ్రాన్సిస్కో హెడ్ క్వాటర్స్ ఆఫీస్ స్పేస్ బెడ్‌రూమ్ గురించి సమాచారం వెలుగులోకి వచ్చిన వెంటనే, నగర అధికారులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. "భవనం దేనికి ఉపయోగించబడుతుందో మేము నిర్ధారించుకోవాలి" అని శాన్ ఫ్రాన్సిస్కో డిపార్ట్‌మెంట్ ఆఫ్ బిల్డింగ్ ఇన్‌స్పెక్షన్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ పాట్రిక్ హన్నన్ ఒక ప్రకటనలో తెలిపారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios