మనం ఎప్పుడు చనిపోతామో తెలుసుకోవచ్చా.. మరణాన్ని అంచనా వేసే AI టెక్నాలజీతో పరిశోధకులు..

ప్రొఫెసర్ సన్ లెమాన్ నేతృత్వంలోని బృందం దీని తెరవెనుక పనిచేసింది. ఇది ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, లింగం, విద్య, పని, ఆదాయం, ఆర్థిక లావాదేవీలతో సహా వ్యక్తుల గురించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఉహించి  అంచనా వేసే AI టూల్. 

Want to know when we will die, that is possible; Researchers with AI technology that predicts death-sak

మనం ఎప్పుడు  చనిపోతామని మనకు తెలిస్తే ఎలా ఉంటుంది..?  ఆలోచిస్తున్నారా.. అదంతా ఎలా తెలుసుకోవాలో చెబుతా.. అయితే పరిష్కారం లేని సమస్య ఏదైనా ఉందా..? మన మరణ సమయం తెలుసుకోవచ్చు.. అది కూడా ఎలా..? పరిశోధకులు అందుకు ఒక మార్గాన్ని అభివృద్ధి చేశారు. డెన్మార్క్‌లోని టెక్నికల్ యూనివర్శిటీ పరిశోధకులు AI ఆధారంగా మానవ మరణాన్ని అంచనా వేయగల టూల్ ని అభివృద్ధి చేశారు. ఈ అల్గారిథమ్ పేరు 'life2vec'. ఇది 78 శాతం ఖచ్చితత్వంతో ఒక వ్యక్తి జీవితకాలాన్ని అంచనా వేయగలదని పరిశోధకులు పేర్కొన్నారు.

ప్రొఫెసర్ సన్ లెమాన్ నేతృత్వంలోని బృందం దీని తెరవెనుక పనిచేసింది. ఇది ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం, లింగం, విద్య, పని, ఆదాయం, ఆర్థిక లావాదేవీలతో సహా వ్యక్తుల గురించిన సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా ఉహించి  అంచనా వేసే AI టూల్. దీని డేటా విశ్లేషణ వర్క్ ChatGPT వెనుక పనిచేసే ట్రాన్స్‌ఫార్మర్ మోడల్‌లను ఉపయోగించి జరుగుతుంది. వ్యక్తుల జీవితాల్లోని సంఘటనలకు సంబంధించిన డేటాను సేకరించి, వాటిని సీక్వెన్స్‌లుగా క్రమబద్ధీకరించడం ద్వారా AI శిక్షణ పొందింది. ఈ అధ్యయనంలో భాగంగా 2008 నుండి 2020 మధ్య డెన్మార్క్ నుండి ఆరు మిలియన్ల మందిపై రీసర్చ్ నిర్వహించింది. 

దీని ప్రకారం, లైఫ్2వీక్ జనవరి 1, 2016 తర్వాత డేటాను ఖచ్చితంగా అంచనా వేయగలిగింది. చాలా మంది వ్యక్తుల మరణాన్ని అంచనా వేసినప్పటికీ, వాస్తవాన్ని సంబంధిత వ్యక్తులకు తెలియజేయలేదని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ టూల్  మరణాన్ని అంచనా వేయడం తప్ప వేరే విధంగా ఉపయోగించవచ్చా అనేది అస్పష్టంగా ఉంది. మానవ దీర్ఘాయువు కోసం ఈ టూల్ ఎలా ఉపయోగించాలనేది పరిశోధకుల లక్ష్యం. లైఫ్ 2వి ప్రజలకు లేదా ఏ సంస్థలకు అందుబాటులోకి రాలేదని నివేదికలు సూచిస్తున్నాయి. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios