ధర తగ్గిన వివో వి9 స్మార్ట్ ఫోన్

Vivo V9 smart phone Price Cut in India
Highlights

అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, పేటీఎం మాల్‌, వివో ఈ-స్టోర్‌ అన్ని ఛానల్స్‌లోనూ కొత్త ధరలోనే వివో వీ9 లభ్యమవుతుంది


ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ వివో.. వినియోగదారులకు శుభవార్త తెలియజేసింది. వివో కంపెనీ మిడ్‌-రేంజ్‌ స్మార్ట్‌ఫోన్‌ వివో వీ9 ధర తగ్గించింది. ఫోన్ అసలు ధరపై రూ.2వేలు తగ్గిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

ఫోన్ ని తొలుత విడుదల చేసినప్పుడు దీని ధర రూ.22,990 కాగా..  ధర తగ్గింపు అనంతరం రూ.20,990కే లభించనుంది.  కేవలం ఒకే ఒక్క వేరియంట్లో భారత్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులో ఉంది. ఇటీవలే కొత్త మోడల్‌ను అంతర్జాతీయ మార్కెట్‌లో లాంచ్‌చేసింది. 

వివో వీ9 ఫీచర్లు
ఐఫోన్‌ ఎక్స్‌ మాదిరి డిస్‌ప్లే నాచ్‌
6.3 అంగుళాల డిస్‌ప్లే
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో ఆధారిత సాఫ్ట్‌వేర్‌
క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 626 ప్రాసెసర్‌
4 జీబీ ర్యామ్‌, 64 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌
256 జీబీ ఎక్స్‌పాండబుల్‌ మెమరీ
24 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా
16 మెగాపిక్సెల్‌, 5 మెగాపిక్సెల్‌ సెన్సార్లతో రియర్‌ కెమెరా
3260 ఎంఏహెచ్‌ బ్యాటరీ

loader