స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’ తన నూతన స్మార్ట్‌ఫోన్‌ ‘వి15 ప్రొ’ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 6.39 అంగుళాల డిస్‌ప్లేను కలిగిన ఈ ఫోన్‌ ధరను రూ.28,990గా నిర్ణయించింది. బుధవారం ఈ స్మార్ట్‌ఫోన్‌ను వివో ఇండియా సీఈఓ కెంట్‌ చెంగ్‌ ఆవిష్కరించారు. మార్చి 8 నుంచి దీన్ని విక్రయిస్తామని వివో ప్రకటించింది.

నాలుగు కెమెరాలతో వీ 15 ప్రో వెరీ స్పెషల్
వివో ‘వీ15 ప్రో’లో ముందు వైపు 32 మెగాపిక్సల్‌ కెమెరా ఉన్న పాపప్‌ ఫ్రంట్‌ కెమెరాను అమర్చారు. కేవలం 0.46 సెకన్లలోనే కెమెరా బయటకొచ్చేలా ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్‌ 675 ప్రాసెసర్‌, 6 జీబీ ర్యామ్‌తోపాటు 128 జీబీ స్టోరేజీ సామర్థ్యం కలిగి ఉంది. వెనుక భాగంలో 12, 5, 8 మెగాపిక్సల్‌ కెమెరాలు మూడింటిని ఏర్పాటు చేశారు. 

ఫాస్ట్ చార్జింగ్ వి15 ప్రో స్పెషాలిటీ
ఈ ఫోన్‌లో 3700 ఎంఎహెచ్‌ సామర్థ్యం కలిగిన ఈ ఫోన్‌ డ్యుయల్‌ ఇంజిన్‌ ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్‌ను అందిస్తుందని వివో తెలిపింది. 2 గిగాహెడ్జ్‌ ఆక్టాకోర్‌ స్నాప్‌డ్రాగన్‌ 675 ప్రాసెసర్‌, 128 జిబి స్టోరేజ్‌, 256 జిబి ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్‌ 9.0 పై, డ్యుయల్‌ సిమ్‌, ఇన్‌డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

ప్రపంచంలోనే తొలి పాపప్ సెల్పీ కెమెరా లభ్యం
కాగా, ఇది ప్రపంచంలోనే తొలి పాపప్ సెల్ఫీ కెమెరా ఫోన్ అని వివో పేర్కొంది. ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ ద్వారా మార్చి 6వ తేదీనుంచి  అందుబాటులోకి రానుంది. ఆన్ లైన్ విక్రయాలు ప్రారంభమయ్యే నాటికి దానిపై లభించే ఆఫర్లు, డిస్కౌంట్లను వివరంగా తెలియజేస్తామని వివో ప్రకటించింది. 

85.64 లక్షలు @ రిలయన్స్ జియో కస్టమర్లు
డిసెంబర్ నెల ముగిసే నాటికిదేశంలో టెలికాం వినియోగదారుల సంఖ్య స్వల్పంగా పెరిగి 119.7 కోట్లకు చేరింది. ట్రాయ్‌ గణాంకాల ప్రకారం.. డిసెంబర్‌లో రిలయన్స్‌ జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌లు వరుసగా 85.64 లక్షలు, బీఎస్‌ఎన్‌ఎల్‌ 5.56 లక్షలు చొప్పున ఖాతాదారులను పెంచుకున్నాయి. దీంతో రిలయన్స్‌ జియో, బీఎస్‌ఎన్‌ఎల్‌ చందాదారుల సంఖ్య వరుసగా 28 కోట్లు, 11.4 కోట్ల మందికి చేరింది.

వొడాఫోన్ ప్లస్ ఎయిర్‌టెల్‌కు 48.3 లక్షల యూజర్లు గుడ్ బై
మరోవైపు వొడాఫోన్‌ ఐడియా 23.3 లక్షలు, ఎయిర్‌టెల్‌ 15 లక్షల మంది ఖాతాదారులను కోల్పోయాయి. వీటి మొత్తం చందాదారుల సంఖ్య వరుసగా 42 కోట్లు, 34 కోట్లకు చేరింది. 2018 నవంబరులో 119.37 కోట్లుగా ఉన్న టెలికాం చందాదారుల సంఖ్య.. డిసెంబరులో 0.35 శాతం వృద్ధితో 119.78 కోట్లకు చేరింది.