Asianet News TeluguAsianet News Telugu

Upcoming Phones:వన్ ప్లస్ నుండి పోకో వరకు..ఈ వారం ఇండియాలో లాంచ్ కానున్న గొప్ప స్మార్ట్‌ఫోన్‌లు ఇవే..

వన్ ప్లస్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్ ప్లస్ 11 5Gని రేపు అంటే ఫిబ్రవరి 7న లాంచ్ చేయబోతోంది. కంపెనీ ఈ ఏడాది అతిపెద్ద ఈవెంట్ క్లౌడ్ 11లో ఈ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ 16 జీబీ ర్యామ్‌తో రానుంది. 

Upcoming Phones: These great smartphones will be launched in India this week
Author
First Published Feb 6, 2023, 6:27 PM IST

ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఇండియాలో ఒకదాని తర్వాత మరొకటి గొప్ప గొప్ప  స్మార్ట్‌ఫోన్‌లు లాంచ్ ఆవుతున్నాయి. శామ్సంగ్ ఫ్లాగ్‌షిప్ సిరీస్ గెలాక్సీ ఎస్ 23 సిరీస్ ఇంకా ఒప్పో రెనో 8టి 5జితో సహా ఎన్నో స్మార్ట్‌ఫోన్‌లు ఫిబ్రవరి మొదటి వారంలో వచ్చాయి. ఈ వారం కూడా ఇండియాలో వన్‌ప్లస్,

పోకోతో సహా ఇతర స్మార్ట్‌ఫోన్‌లు కూడా లాంచ్ కానున్నాయి. వన్ ప్లస్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్ ప్లస్ 11 5Gని క్లౌడ్ 11 ఈవెంట్‌లో విడుదల చేయనుంది. మీరు కొత్త ఫోన్‌ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే..  ఈ వారం ఇండియాలో లాంచ్ కానున్న గొప్ప స్మార్ట్‌ఫోన్‌ల గురించి  తెలుసుకుందాం...

వన్ ప్లస్ 11 5G
వన్ ప్లస్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్ ప్లస్ 11 5Gని రేపు అంటే ఫిబ్రవరి 7న లాంచ్ చేయబోతోంది. కంపెనీ ఈ ఏడాది అతిపెద్ద ఈవెంట్ క్లౌడ్ 11లో ఈ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. ఈ ఫోన్ 16 జీబీ ర్యామ్‌తో రానుంది. దీనితో పాటు కంపెనీ ఈ ఫోన్‌తో ఐదేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్‌లను కూడా అందిస్తుంది. అంటే, ఆండ్రాయిడ్ 17 అప్‌డేట్ కూడా ఫోన్‌లో రవొచ్చు. 

పోకో X5 సిరీస్
పోకో కొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ పోకో X5ని కూడా ప్రారంభించబోతోంది. ఈ ఫోన్ సిరీస్ ఫిబ్రవరి 6న సాయంత్రం 5.30 గంటలకు లాంచ్ కానుంది. ఈ సిరీస్ కింద పోకో X5, పోకో X5 ప్రొ లాంచ్ చేయబడతాయి. రెడ్ మీ ఫోన్ రీబ్రాండెడ్ వెర్షన్ సమయంలో ఈ ఫోన్‌లను పరిచయం చేయవచ్చని చెప్తూన్నారు. పోకో X5 ప్రొ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను పొందవచ్చు.  అలాగే పోకో X5 Proతో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌ని చూడవచ్చు.

వన్ ప్లస్ 11R
వన్ ప్లస్ ఈ ఫోన్ రేపు అంటే ఫిబ్రవరి 7న కూడా లాంచ్ అవుతుంది. వన్ ప్లస్11 5జి, వన్ ప్లస్ బడ్స్ ప్రొ 2, వన్ ప్లస్ పాడ్ అండ్ వన్ ప్లస్ టి‌వి 65 Q2 ప్రొని ఫిబ్రవరి 7న జరిగే క్లౌడ్ 11 ఈవెంట్‌లో పరిచయం చేయబడుతుంది. వన్ ప్లస్ 11R స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1తో అందించబడుతుంది. ఫోన్‌లో 16 జీబీ ర్యామ్ రానుంది. అలాగే ఫోన్ సోనీ IMX890 ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో అందించవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios