Trivia: సిమ్ కార్డ్ ఒక మూలకి ఎందుకు కత్తిరించి ఉంటుందో తెలుసా... దీనికి అర్ధం ఏంటి..?
మొబైల్ ఫోన్ల కోసం సిమ్ కార్డులు తయారు చేసినప్పుడు ఆ సమయంలో దీని రూపకల్పన చాలా సాధారణం. దానిపై ఎలాంటి కట్ డిజైన్ లేదు. దీంతో మొబైల్‌లో సిమ్ కార్డ్‌ని ఇన్‌సర్ట్ చేయడంలో, తీయడంలో చాలాసార్లు ఇబ్బందులు పడాల్సి వచ్చేది.
నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతిఒక్కరికీ స్మార్ట్‌ఫోన్ ఉండే ఉంటుంది. మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత దేశం, ప్రపంచం, సమాజంలో పెను మార్పు కనిపిస్తోంది. ఇది ప్రపంచాన్ని వర్చువల్ డైమెన్షన్‌గా మార్చడానికి పనిచేసింది. ఇది ఒక పెద్ద కారణం. దీని కారణంగా మన ముఖ్యమైన పనిలు చాలా వరకు వర్చువల్ గా పూర్తి అవుతుంది. నేడు విద్య నుంచి వినోదం వరకు ఎన్నో పనులు మొబైల్ ఫోన్లలోనే చేస్తున్నాం. అయితే ఈ సేవలన్నింటినీ ఉపయోగించడానికి మీరు తప్పనిసరిగా మీ ఫోన్‌లో SIM కార్డ్‌ని ఇన్‌స్టాల్ చేసి ఉండాలి.
SIM కార్డ్ ద్వారా మాత్రమే మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇంటర్నెట్ పనిచేస్తుంది. దేశంలో చాలా పెద్ద టెలికాం కంపెనీలు ఉన్నాయి, ఇవి ప్రజల అవసరాలను తీరుస్తున్నాయి. కొత్త ఫోన్ కొన్న తర్వాత ఖచ్చితంగా SIM కార్డ్ కొనుగోలు చేస్తాము లేదా మొబైల్ ఫోన్‌లో మన పాత SIM కార్డ్‌ని వేస్తాము. అయితే సిమ్ కార్డుని ఎప్పుడైనా పరిశీలించి చూస్తే ఒక మూల ఎందుకు కత్తిరించి ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సిమ్ కార్డ్ ఒక మూల కత్తిరించబడటానికి గల కారణం తెలుసా.. తొలినాళ్లలో సిమ్ కార్డుకు కట్ డిజైన్ ఉండేది కాదు.
మొబైల్ ఫోన్ల కోసం సిమ్ కార్డులు తయారు చేసినప్పుడు ఆ సమయంలో దీని రూపకల్పన చాలా సాధారణం. దానిపై ఎలాంటి కట్ డిజైన్ లేదు. దీంతో మొబైల్‌లో సిమ్ కార్డ్‌ని ఇన్‌సర్ట్ చేయడంలో, తీయడంలో చాలాసార్లు ఇబ్బందులు పడాల్సి వచ్చేది.
SIM కార్డ్ స్ట్రెయిట్ అండ్ రివర్స్ సైడ్ ఏది అని అర్థం చేసుకోవడంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు మొదట్లో.. టెలికాం కంపెనీలు ఈ లొసుగును పట్టుకుని సిమ్ కార్డుల రూపకల్పనలో కొన్ని మార్పులు చేశాయి.
ఈ కారణంగా సిమ్ కార్డ్ కంపెనీలు సిమ్ కార్డును ఒక మూల కత్తిరించాయి. సిమ్ కార్డ్ కట్ చేయడం వల్ల మొబైల్ లో సిమ్ కార్డ్ పెట్టుకోవడం చాలా సులువుగా మారింది. దీంతో మొబైల్ లో సిమ్ కార్డ్ ఇన్ స్టాల్ చేసుకునే పని సులువైంది.
ఈ కారణంగా ఎన్నో ఇతర కంపెనీలు కూడా ఒక మూల సిమ్ కార్డ్ కట్ చేయడం ప్రారంభించాయి. ఈరోజుల్లో స్మార్ట్‌ఫోన్‌లలో సిమ్ కార్డ్ ట్రే డిజైన్‌కు కూడా ఒకవైపు కట్ మార్క్ ఉంటుంది, దీనివల్ల కస్టమర్‌లు స్మార్ట్‌ఫోన్‌లో సిమ్‌ను ఇన్‌సర్ట్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉండదు.