ఫేస్ అన్‌లాక్ ఫీచర్ తో మార్కెట్లోకి బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. హెచ్‌డి వీడియో రికార్డింగ్ కూడా చేయవచ్చు..

హానర్ ఎక్స్5ని సన్‌రైజ్ ఆరెంజ్, ఓషన్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు. ఈ ఫోన్ ప్రపంచ మార్కెట్‌లో కూడా విడుదలైంది. 2జి‌బి ర్యామ్ తో 32 జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర 99 యూరోలు అంటే సుమారు రూ. 8,700గా ఉంది. 
 

This great phone launched with 5000mAh battery know its price and other specifications here

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ హానర్  కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ హానర్ ఎక్స్5ను లాంచ్ చేసింది. ఈ ఫోన్‌ను ఒకేసారి ప్రపంచ మార్కెట్‌లో కూడా ప్రవేశపెట్టారు. 8 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా సెటప్, 5,000 mAh బ్యాటరీ  ఫోన్‌తో లభిస్తుంది. 6.5-అంగుళాల డిస్‌ప్లేతో సెక్యూరిటి కోసం ఫోన్‌లో ఫేస్ అన్‌లాక్ ఫీచర్ అందించారు. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం...

హానర్ ఎక్స్5 ధర 
హానర్ ఎక్స్5ని సన్‌రైజ్ ఆరెంజ్, ఓషన్ బ్లూ, మిడ్‌నైట్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు. ఈ ఫోన్ ప్రపంచ మార్కెట్‌లో కూడా విడుదలైంది. 2జి‌బి ర్యామ్ తో 32 జి‌బి స్టోరేజ్ వేరియంట్ ధర 99 యూరోలు అంటే సుమారు రూ. 8,700గా ఉంది. 

స్పెసిఫికేషన్లు 
 హానర్ X5కి 6.5 అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లే, వాటర్‌డ్రాప్ నాచ్ డిజైన్‌కు సపోర్ట్ చేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో లెదర్ టేక్శ్చర్ ఉంది. MediaTek Helio G25 ప్రాసెసర్, 2 జి‌బి ర్యామ్ తో 32జి‌బి వరకు ఇంటర్నల్  స్టోరేజీ అందించారు. Android 12 GO ఎడిషన్ హానర్ X5లో లభిస్తుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫోన్‌కి సపోర్ట్ చేయదు, అయితే సెక్యూరిటి కోసం ఫేస్ అన్‌లాక్ ఫీచర్ ఇచ్చారు.

హానర్ X5 కెమెరా అండ్ బ్యాటరీ 
హానర్ X5లో సింగిల్ బ్యాక్ కెమెరా ఉంది, ఇది 8 మెగాపిక్సెల్‌లు. కెమెరాతో LED ఫ్లాష్ ఇంకా 1080p వీడియో రికార్డింగ్ చేయవచ్చు. సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. 5,000 mAh బ్యాటరీ ఫోన్‌తో లభిస్తుంది. ఫోన్‌లో కనెక్టివిటీ కోసం మైక్రో-USB పోర్ట్, 3.5mm ఆడియో జాక్, 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ అండ్ డ్యూయల్ సిమ్‌లకు సపోర్ట్ ఉంది. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios