Asianet News TeluguAsianet News Telugu

ఈ ఫీచర్ ఇకపై ఇన్‌స్టాగ్రామ్‌లో ఉండదు.. హోమ్ ఫీడ్‌లో పెద్ద మార్పు.. రాబోయే ఈ ఫీచర్లను తెలుసుకోండి..

ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త మార్పులు వచ్చే నెల నుండి విడుదల చేయనుంది. అయితే, ఏదిఏమైనప్పటికి యూజర్లు ఈ ప్లాట్‌ఫారమ్ నుండి షాపింగ్ చేయవచ్చు. యూజర్లు హోమ్ షాపింగ్ ట్యాబ్‌కు బదులుగా ప్లాట్‌ఫారమ్ నుండి షార్ట్‌కట్‌లు లేకుండా షాపింగ్ చేయగలరని కంపెనీ తెలిపింది. 

This feature will no longer be available on Instagram, big change happening in home feed, also know the upcoming new features
Author
First Published Jan 10, 2023, 7:46 PM IST

మెటా యాజమాన్యంలోని ఫోటో-వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్‌ హోమ్ ఫీడ్‌లో పెద్ద మార్పు చేయబోతోంది. నివేదిక ప్రకారం, కంపెనీ  హోమ్ ఫీడ్ నుండి షాపింగ్ ట్యాబ్‌ను తీసివేయబోతోంది. అలాగే దాని స్థానంలో 'క్రియేట్ న్యూ పోస్ట్' ట్యాబ్ తీసుకురవొచ్చు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ నోట్స్, క్యాండిడ్ స్టోరీస్, గ్రూప్ ప్రొఫైల్ వంటి ఎన్నో తాజా ఫీచర్లు ఈ ప్లాట్‌ఫారమ్‌లో విడుదలయ్యాయి.

ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త మార్పులు వచ్చే నెల నుండి విడుదల చేయనుంది. అయితే, ఏదిఏమైనప్పటికి యూజర్లు ఈ ప్లాట్‌ఫారమ్ నుండి షాపింగ్ చేయవచ్చు. యూజర్లు హోమ్ షాపింగ్ ట్యాబ్‌కు బదులుగా ప్లాట్‌ఫారమ్ నుండి షార్ట్‌కట్‌లు లేకుండా షాపింగ్ చేయగలరని కంపెనీ తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్  వినియోగదారులకు స్మార్ట్‌ఫోన్‌ల నుండి స్మార్ట్‌ఫోన్ అసెసోరిస్ వరకు ఇంకా బూట్ల నుండి బట్టల వరకు షాపింగ్ ట్యాబ్ ద్వారా కొనుగోలు చేయవచ్చు అని వివరించింది.

కొత్త ఫీచర్లపై ఇన్‌స్టాగ్రామ్ 
ఈ మార్పుతో పాటు క్రియేట్ న్యూ పోస్ట్ ట్యాబ్‌తో సహా ప్లాట్‌ఫారమ్‌లో మరిన్ని మార్పులు చేయనుంది. అంటే, ప్లాట్‌ఫారమ్‌లోని హోమ్ ఫీడ్‌లో కనిపించే ట్యాబ్‌ల సంఖ్య మార్చబడదు. ఇప్పుడు Instagramలో షాపింగ్ ట్యాబ్‌కు బదులుగా కొత్త క్రియేట్ న్యూ పోస్ట్ ట్యాబ్ కనిపిస్తుంది. ఈ ప్లాట్‌ఫారమ్ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ నోట్స్, క్యాండిడ్ స్టోరీస్, గ్రూప్ ప్రొఫైల్‌లు, కొలబొరేషన్ కలెక్షన్స్ మొదలైన వాటిని పరిచయం చేసింది. 

ఇన్‌స్టాగ్రామ్ నోట్స్ ఫీచర్
ఈ కొత్త ఫీచర్లు యూజర్లు వారి స్నేహితులు, కుటుంబ సభ్యులతో కనెక్ట్ అవ్వడానికి సహాయపడతాయని ఇన్‌స్టాగ్రామ్ బ్లాగ్ పోస్ట్‌లో తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ నోట్స్ ఫీచర్ ద్వారా వినియోగదారులు స్నేహితులకి టెక్స్ట్ ఇంకా ఎమోజీలను ఉపయోగించి అప్‌డేట్ చెప్పవచ్చు. అంటే, ఈ ఫీచర్‌ను స్టేటస్ షార్ట్ ఫార్మాట్ అని పిలుస్తారు, దీనిలో యూజర్లు ఎమోజీ ఇంకా టెక్స్ట్‌లో 60 అక్షరాల వరకు షార్ట్ స్టోరీ పోస్ట్ చేయవచ్చు. ఇంకా యూజర్లు నోట్స్ కూడా లిమిట్ చేయవచ్చు.

క్యాండీడ్ స్టోరీస్ 
ఇన్‌స్టాగ్రామ్  ఈ ఫీచర్ BeReal అప్లికేషన్ ద్వారా ప్రేరణ పొందింది. ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్ మోడ్‌లో ఉంది. క్యాండిడ్ స్టోరీస్‌లో, నోటిఫికేషన్‌పై క్లిక్ చేయడం ద్వారా వినియోగదారులు ఫోటోను అప్‌లోడ్ చేయాలి. ఈ ఫోటో క్యాండీడ్ స్టోరీస్లను  షేర్ చేసే వ్యక్తులకు మాత్రమే కనిపిస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios