Asianet News TeluguAsianet News Telugu

టెల్కోల మధ్య పోటీ: ప్లాన్​ ఏదైనా వినోదం ఫ్రీ


యూజర్లను ఆకట్టుకునేందుకు టెల్కోలు వినూత్న పథకం అమలుచేస్తున్నాయి. ప్లాన్ ఏదైనా ఉచితంగా వీడియోలు, సినిమాలు చేసే వెసులుబాటు కల్పిస్తున్నాయి రిలయన్స్ జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా.

Telcos Compared Across Content Offerings: Bharti Airtel, Reliance Jio and Vodafone Idea
Author
New Delhi, First Published Aug 26, 2019, 10:27 AM IST

న్యూఢిల్లీ: యూజర్లను ఆకర్షించేందుకు పోటాపోటీ టారీఫ్​ ఆఫర్లు ప్రకటించే టెలికాం సంస్థలు ఇప్పుడు రూటు మార్చాయి. నెలవారీ సబ్ స్క్రిప్షన్‌తో పాటు వినోదానికి పెద్ద పీట వేస్తున్నాయి. ఉచితంగా సినిమాలు, వెబ్ ​సీరిస్​లు, పాటలు అందిస్తున్నాయి.

రిలయన్స్ జియో మార్కెట్లోకి ప్రవేశించిన తర్వత దాదాపు అన్ని టెలికం సంస్థలు వాటి టారీఫ్​లు మార్చుకున్నాయి. అప్పటి వరకు ఉన్న డేటా ఛార్జీల మోత తగ్గింది. కొన్ని రోజుల వరకు కాలింగ్, డేటా ఛార్జీల్లో ప్రత్యేక తగ్గింపుతో పోటాపోటీ ఆఫర్లు ప్రకటించాయి టెలికం సంస్థలు.

ఇప్పుడు ఈ విధానాన్ని పక్కన పెట్టి సరికొత్త పద్ధతిలో యూజర్లను ఆకర్షిస్తున్నాయి. రిలయన్స్ జియో, ఎయిర్​టెల్​, వొడాఫోన్-ఐడియా తదితర దిగ్గజాలు ఉచితంగా సినిమాలు, లైవ్​ టీవీ, వెబ్ ​సీరిస్​లు చూసేందుకు అవకాశం ఇస్తున్నాయి.

ఇందుకోసం ఇప్పటికే అందుబాటులో ఉన్న హాట్​ స్టార్​, అమెజాన్​ ప్రైమ్, నెట్​ఫ్లిక్స్ సహా ఇతర వీడియో ఆన్ డిమాండ్ సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. జియో టీవీ, జియో సినిమా.. సబ్​స్క్రిప్షన్​తో పాటు వీడియోలు, సినిమాలు ఉచితంగా చూసే సంప్రదాయాన్ని రిలయన్స్ జియో మొదటగా పరిచయం చేసింది. 

మార్కెట్లోకి ప్రవేశించిన వెంటనే జియో యాప్​ల సందడి మొదలైంది. అన్ని రకాల అవసరాలకు యాప్​లు అందుబాటులోకి తెచ్చింది ముకేశ్​ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో.వాటిలో జియో టీవీ యాప్​.. లైవ్ టీవీ​ ఛానెళ్లను చూసే వీలు కల్పిస్తుంది. 
దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 600 వరకు ఛానళ్లు జియో టీవీలో అందుబాటులో ఉన్నాయి. జియో సినిమా యాప్​ ద్వారా డిస్నీ సహా మరెన్నో నిర్మాణ సంస్థల సినిమాలను ఉచితంగా చూసే వీలుంది. వీటితో పాటు సంగీత ప్రియులకు 'జియో సావన్'​ ద్వారా లక్షలాది పాటలు అందుబాటులో ఉన్నాయి. 

వొడాఫోన్​-ఐడియా సంయుక్తంగా ఉన్నా.. వాటి నుంచి రెండు వేర్వేరు వీడియో ఆన్​ డిమాండ్​ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. 'వొడాఫోన్ ప్లే' యాప్​ ద్వారా వినియోగదారులు ఎంచుకునే వీడియోలను చూసే వీలుంది. జీ5, ఏఎల్​టీ బాలాజీ సంస్థల ప్రీమియం వీడియోలనూ వొడాఫోన్​ ద్వారా పొందొచ్చు. ఐడియా మూవీస్​, ఐడియా టీవీ యాప్​ల ద్వారా సినిమాలు, లైవ్​ టీవీ చూసే వీలుంది. వీటితో పాటు సోనీ లైవ్​, జీ5, సన్​నెక్స్ట్​, షిమరో మీ, హోయ్​కోయ్​, ఎరోస్​ నవ్, హంగామా వంటి ఓటీటీ సంస్థల వీడియోలను ఐడియా అందిస్తోంది. 

ఎయిర్ టెల్ జియో తర్వాత ఎయిర్​టెల్​ ఫేవరెట్​ వినోదానికి పెద్ద పీట వేస్తూ జియో అందిస్తున్నఆఫర్లకు పోటీ ఇస్తున్న ఏకైక సంస్థ ఎయిర్​టెల్. పోస్ట్ పెయిడ్​, ప్రీపెయిడ్​ వినియోగదారులందరికీ ఎయిర్​టెల్ వీడియో ఆన్​ డిమాండ్​ ఆఫర్లు అందిస్తోంది. 

దాదాపు అన్ని ప్లాన్​లకు అదనంగా 'ఎయిర్​టెల్​ టీవీ' ప్రీమియం సబ్​స్క్రిప్షన్​ ఇస్తోంది. ఎయిర్​టెల్​ టీవీలోనూ జియో టీవీ మాదిరిగానే పది వేలకు పైగా సినిమాలు, టీవీ షోలు అందుబాటులో ఉన్నాయి. ఎరోస్​ నవ్​, ఏఎల్​టీ బాలాజీ, హంగామా సహా పలు ఇతర సంస్థల వీడియోలను​ ఎయిర్​టెల్ యూజర్లు చూడొచ్చు.

ఎయిర్​టెల్​కు చెందిన వింక్​ మ్యూజిక్ ద్వారా పాటలు స్ట్రీమ్​ చేసేందుకు, వింక్​ ట్యూబ్ ద్వారా వీడియోలు చూసేందుకు వీలుంది. కొన్ని ప్రత్యేక ప్యాకేజీల్లో అమెజాన్ ప్రైమ్​, నెట్​ఫ్లిక్స్ సబ్​స్క్రిప్షన్​లను అందిస్తోంది ఎయిర్​టెల్​. 

Follow Us:
Download App:
  • android
  • ios