27గంటల బ్యాటరీ బ్యాకప్‌తో సెన్‌హైజర్ కొత్త ఇయర్‌బడ్స్ లాంచ్.. ఎక్కువసేపు సౌకర్యంగా ఉండేలా డిజైన్..

సెన్‌హైజర్ సిఎక్స్ ప్లస్ ధర రూ. 14,990, సెన్‌హైజర్ సిఎక్స్ ధర రూ. 10,990. ఈ రెండు ఇయర్‌బడ్‌లు  నలుపు, తెలుపు రంగులలో అమెజాన్ నుండి విక్రయించనుంది.
 

Sennheiser CX launches two new earbuds in India with 27 hours of battery backup

జర్మన్ కంపెనీ సెన్‌హైజర్ రెండు వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు  సెన్‌హైజర్ సిఎక్స్ ప్లస్(Sennheiser CX plus) అండ్ సెన్‌హైజర్ సిఎక్స్ (Sennheiser CX)లను భారతదేశంలో విడుదల చేసింది. ఈ రెండు ఇయర్‌బడ్‌లు ఎక్కువసేపు ఉపయోగించడానికి చాలా సౌకర్యంగా ఉండేలా రూపొందించారు. అంతేకాకుండా, సెన్‌హైజర్ సి‌ఎక్స్ ప్లస్ అండ్ సి‌ఎక్స్ గురించి అధిక-నాణ్యత ఆడియో క్లెయిమ్ చేయబడింది. సెన్‌హైజర్ సి‌ఎక్స్ ప్లస్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC), ట్రాన్స్‌పరెన్సీ మోడ్ అండ్ ఆడియోఫైల్ గ్రేడ్ స్నిఫర్ టెక్నాలజీతో వస్తుంది.

సెన్‌హైజర్ సి‌ఎక్స్ ప్లస్ అండ్ సి‌ఎక్స్ లో డీప్ బేస్, నేచురల్ మిడ్‌, డిటైల్ ట్రెబుల్ అండ్ కస్టమ్ ఈ‌క్యూ క్లెయిమ్ చేయబడ్డాయి. సెన్‌హైజర్ సి‌ఎక్స్ ప్లస్ అండ్ సి‌ఎక్స్ టి‌డబల్యూ‌ఎస్ రెండింటిలోనూ కనెక్టివిటీ కోసం బ్లూటూత్ 5.2 సపోర్ట్ చేయబడింది. అంతేకాకుండా ఆడియో కోడెక్‌లకు కూడా సపోర్ట్ ఉంది. రెండు ఇయర్‌బడ్‌లతో యాప్ సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. సెన్‌హైజర్ సిఎక్స్ ప్లస్ ధర రూ. 14,990, సెన్‌హైజర్ సిఎక్స్ ధర రూ. 10,990. రెండూ నలుపు ఇంకా తెలుపు రంగులలో అమెజాన్ నుండి విక్రయించబడుతున్నాయి.

సెన్‌హైజర్ సి‌ఎక్స్ ప్లస్ స్పెసిఫికేషన్లు
సెన్‌హైజర్ సి‌ఎక్స్ ప్లస్ టి‌డబల్యూ‌ఎస్ లో ఆక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది. అంతేకాకుండా ట్రాన్స్పరెంట్ మోడ్ కూడా ఇందులో ఇచ్చారు. సి‌ఎక్స్ ప్లస్ బ్యాటరీకి సంబంధించి 24 గంటల బ్యాకప్ క్లెయిమ్ చేయబడింది. దీంతో  ఇయర్‌టిప్స్‌ కూడా రానున్నాయి. ఇంకా నీటి నిరోధకత కోసం IPX4గా రేట్ చేయబడింది. అలాగే కస్టమైజబుల్ టచ్ కంట్రోల్ కూడా వస్తుంది. దీనితో SBC, AAC, aptX, aptX అడాప్టివ్ కోడెక్‌లకు సపోర్ట్ ఉంది. 

సెన్‌హైజర్ సి‌ఎక్స్ స్పెసిఫికేషన్లు
ఈ ఇయర్‌బడ్‌లు  టచ్ కంట్రోల్స్‌తో కూడా వస్తుంది ఇంకా వాటర్ రెసిస్టెంట్ కోసం IPX4 రేటింగ్‌ను పొందింది.  బ్లూటూత్ 5.2, కనెక్టివిటీ కోసం ఎన్నో ఇతర కోడెక్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో డ్యూయల్ మైక్రోఫోన్ ఉంది. దీని బ్యాటరీ 27 గంటల బ్యాకప్‌ ఉంటుందని కంపెనీ క్లెయిమ్ చేసింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios