స్మార్ట్‌ఫోన్  కానీ, మామూలు ఫోన్ కానీ నీళ్లలో పడితే  పనిచేయదు. ఆ ఫోన్ ను రిపేర్ చేయిస్తేనే  పనికొచ్చే అవకాశం ఉంటుంది.  లేదా ఆ ఫోన్‌లో పాడైన బాగాలను మార్చితే ఫోన్ పనిచేసే అవకాశాలు లేకపోలేదు. 


 కెనడా: స్మార్ట్‌ఫోన్ కానీ, మామూలు ఫోన్ కానీ నీళ్లలో పడితే పనిచేయదు. ఆ ఫోన్ ను రిపేర్ చేయిస్తేనే పనికొచ్చే అవకాశం ఉంటుంది. లేదా ఆ ఫోన్‌లో పాడైన బాగాలను మార్చితే ఫోన్ పనిచేసే అవకాశాలు లేకపోలేదు. ఆపిల్ ఐఫోన్ సముద్రంలో పడినా ఆ ఫోన్ పనిచేస్తోందని తేలింది.

ఆపిల్ 7 ఐఫోన్ సముద్రంలో పడిపోయినా పనిచేసింది. ఆ ఫోన్ ఎక్కడ పడిపోయిందో ఆ ఫోన్ సిగ్నల్ ఆధారంగా కనిపెట్టారు. కెనడాకు చెందిన ఆఫిల్ ఐ ఫోన్ 7 పొరపాటున సముద్రంలో పడిపోయింది. ఎంత వెతికినా దొరకలేదు. యూకేకు చెందిన స్కూబా డైవర్ సిరిస్ హార్సీకి ఆపిల్ ఐఫోన్ దొరికింది.

ఇంగ్లండ్‌లోని డోర్డల్‌ డోర్‌ దగ్గరిలో గల సముద్ర గర్భం నుంచి వెలుగును గమనించిన ఆమె దాని వద్దకు వెళ్లి ఆ వస్తువును తీసింది. ఆపిల్ ఐఫోన్ గా గుర్తించి ఆమె షాకైంది. ఆ ఫోన్ నీళ్లలో తడిచినా కానీ బాగానే పనిచేస్తోందని ఆమె చెప్పింది. 

 48 గంటల పాటు ఆ ఐఫోన్‌ అక్కడే ఉన్నట్టు తెలిసింది. అంతసేపు పూర్తిగా నీటిలోనే మునిగి ఉన్న 84 శాతం బ్యాటరీ సామర్థ్యంతో ఆ ఫోన్‌ మంచిగా పనిచేస్తుందని డిజిటైమ్స్ ప్రకటించింది.తనకు దొరికిన ఫోన్‌ను హార్సీ కెనడియన్ కు అందించింది. ఈ డివైజ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌తో ఐపీ67 రేటింగ్‌ను కలిగి ఉంది.