Asianet News TeluguAsianet News Telugu

స్యామ్సంగ్ బడ్జెట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్.. అదిరిపోయే కెమెరా, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్‌తో లాంచ్ ఎప్పుడంటే..?

టిప్‌స్టర్ ప్రకారం, శామ్‌సంగ్ కొత్త డివైజ్ రౌండ్‌లో స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్22 ఎఫ్‌ఈని ప్రారంభించబోతోంది. ఈ ఫోన్ స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈకి అప్‌గ్రేడ్‌గా అందించబడుతుంది.

Samsungs cheap flagship phone will be launched in the new year, will get 108MP camera
Author
First Published Dec 28, 2022, 12:37 PM IST

ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ స్యామ్సంగ్ అత్యంత శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్ సిరీస్ స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్23ని కొత్త సంవత్సరంలో లాంచ్ చేయబోతోంది. ఈ సిరీస్‌తో పాటు కంపెనీ మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్22 ఎఫ్‌ఈని కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తాజా లీక్‌ ప్రకారం ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి సమాచారం వెల్లడైంది. ఈ లీక్ లో ఫోన్ 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా సెన్సార్‌తో వస్తుంది.  

టిప్ స్టార్ @OreXda స్యామ్సంగ్ నుండి రాబోయే స్మార్ట్‌ఫోన్ గురించి సమాచారాన్ని అందించింది. టిప్‌స్టర్ ప్రకారం, శామ్‌సంగ్ కొత్త డివైజ్ రౌండ్‌లో స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్22 ఎఫ్‌ఈని ప్రారంభించబోతోంది. ఈ ఫోన్ స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్‌ఈకి అప్‌గ్రేడ్‌గా అందించబడుతుంది. ఈ ఫోన్‌తో పాటు కంపెనీ గెలాక్సీ బడ్స్ 2ని కూడా జనవరి 2023లో పరిచయం చేయబోతోంది. 

స్పెసిఫికేషన్లు 
లీక్‌ ప్రకారం ఈ ఫోన్ లో 4nm Exynos 2300 చిప్‌సెట్ సపోర్ట్ పొందుతుంది. ఇంకా 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అందించారు. పాత మోడల్ ఫోన్‌లో 12-మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్ ఉంది. అంటే, కంపెనీ స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్22 ఎఫ్‌ఈ కెమెరాలో పెద్ద మార్పు చేయబోతోంది. 

స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ స్యామ్సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్23ని త్వరలో విడుదల చేయబోతోంది. ఈ సిరీస్ కింద, స్యామ్సంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా టాప్ వేరియంట్‌గా పరిచయం చేయబడుతుంది. ఈ ఫోన్ స్పెసిఫికేషన్ గురించిన కూడా సమాచారం వెల్లడైంది. లీక్స్ ప్రకారం, ఈ ఫోన్‌లో 200 మెగాపిక్సెల్ కెమెరాతో ISOCELL HP2 సెన్సార్‌ను అందించవచ్చు.

దీనితో పాటు, 5,000mAh బ్యాటరీతో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ని కూడా ఫోన్‌లో ఇవ్వవచ్చు. ఫోన్ ఇతర కెమెరా ఫీచర్ల గురించి మాట్లాడితే 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇంకా 10x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ పొందవచ్చు. 60ఎఫ్‌పిఎస్‌లో 8కె వీడియోలను రికార్డ్ చేసే సదుపాయం కూడా ఈ ఫోన్‌లో అందుబాటులోకి రాబోతోందని చెబుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios