Asianet News TeluguAsianet News Telugu

శామ్‌సంగ్ 5జీ ‘ఎ90’ ఫోన్: ఇండియాలో లాంచ్ సాద్యమేనా?


5జీతో రూపుదిద్దుకుంటున్న శామ్ సంగ్ గెలాక్సీ ఎ90 ఫోన్ త్వరలో అంతర్జాతీయ విపణిలో అడుగు పెట్టనున్నది. వచ్చే ఏడాది భారతదేశంలో 5జీ సేవలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ఫోన్‌ను ఇండియా విపణిలో శామ్‌సంగ్ విడుదల చేస్తుందా? లేదా? అన్నదే అనుమానంగా ఉంది.

Samsung Galaxy A90 5G Specifications, Design Tipped From Retail Box Leak, Allegedly Company Site Listing
Author
New Delhi, First Published Sep 3, 2019, 10:19 AM IST

న్యూఢిల్లీ‌: దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్‌సంగ్ ‘ఎ’ సిరీస్‌లో మరో ఫోన్‌ను పరిచయం చేయనున్నది. శామ్‌సంగ్‌ గెలాక్సీ ఏ90 పేరుతో ఆవిష్కరించడానికి సిద్ధం అవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 5జీ టెక్నాలజీతో వస్తున్న, అంత్యంత సరసమైన మొబైల్‌ ఫోన్ అని తాజా నివేదికలు చెబుతున్నాయి. 

ఎప్పుడు విపణిలోకి ఆవిష్కరిస్తారన్న విషయాన్ని శామ్‌సంగ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అధికారిక పోస్టర్‌, రీటైల్‌ బాక్స్‌తోపాటు కొన్ని ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్‌ అయ్యాయి. దీని ప్రకారం స్లిమ్‌ బెజెల్స్‌ ఇన్‌ఫినిటీ యూ డిస్‌ప్లే, ట్రిపుల్‌ రియర్‌ కెమెరా, సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్  ప్రధాన ఆకర్షణ కానున్నాయి. 

శామ్‌సంగ్ ఏ 90 మోడల్ స్మార్ట్ ఫోన్ ధర, బ్యాటరీ సామర్థ్యం లాంటి ఇతర సమాచారం వెల్లడి కావాల్సి ఉంది. అలాగే భారతదేశంలో వచ్చే ఏడాది నాటికి 5జీ సిద్ధం కానుంది. ఈ నేపథ్యంలో శామ్‌సంగ్‌ ఏ 90 4జీ వేరియంట్‌ మోడల్ ఫోన్‌ను ఇండియాలో విడుదల చేస్తుందా? వచ్చే ఏడాది వరకు వేచి చూస్తుందా? అన్న సంగతి స్పష్టం కాలేదు.  

6.7 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే గల శామ్ సంగ్ ఏ 90 ఫోన్ ఆక్టా-కోర్ చిప్ కలిగి ఉంటుంది. 128 జీబీ స్టోరేజ్‌‌తోపాటు 8జీబీ ర్యామ్‌ సామర్థ్యం గల ఈ ఫోన్‌లో 48+8+5 ఎంపీ రియర్‌ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios