AYYA T1 Smartphone: యాపిల్ ఫోన్‌కు ధీటుగా.. రష్యా సరికొత్త స్మార్ట్‌ఫోన్..!
ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు వ్యతిరేకంగా ప్రముఖ యాపిల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్ కంపెనీలు రష్యా (Russia)కు తమ ఉత్పత్తులను నిలిపివేసిన సంగతి మనకు తెలిసిందే. ఇక తాజాగా రష్యా ఈ కంపెనీలకు ధీటుగా కొత్త స్మార్ట్‌ఫోన్ (Smartphone)ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది.
ఉక్రెయిన్‌లో రష్యా సైనిక చర్యకు ప్రతిస్పందనగా ఆ దేశంలో యాపిల్ సంస్థకు చెందిన అన్ని ఉత్పత్తి అమ్మకాలను నిలిపివేయాలని అమెరికన్ బహుళజాతి టెక్నాలజీ దిగ్గజం నిర్ణయం తీసుకుంది. దీంతో, ఐఫోన్‌కు ఢీటుగా పనిచేసే స్వదేశీ మొబైల్‌ను వినియోగించాలని తన దేశ పౌరులకు రష్యా పిలుపునిచ్చింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులకు వ్యతిరేకంగా ప్రముఖ యాపిల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్ కంపెనీలు రష్యా (Russia)కు తమ ఉత్పత్తులను నిలిపివేసిన సంగతి మనకు తెలిసిందే.
ఇక తాజాగా రష్యా ఈ కంపెనీలకు ధీటుగా కొత్త స్మార్ట్‌ఫోన్ (Smartphone)ను తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. ఆ ఫోన్ పేరును అయ్యా టీ1గా రష్యా ప్రకటించింది. ఈ అయ్యా టీ1 ఫోన్ ఐఫోన్‌కు ఏమాత్రం తీసిపోదట. అయ్యా టీ1 మొబైల్‌ను రష్యా సంస్థ స్కేల్ రీసెర్చి ఇన్ స్టిట్యూట్‌కు అనుబంధంగా పనిచేస్తున్న స్మార్ట్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేసిందట. తమదేశ పౌరుల కోసం స్వదేశీ స్మార్ట్‌ఫోన్ ‘అయ్య టీ1(AYYA T1) అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు రష్యా వెల్లడించింది. ఐఫోన్లకు బదులు అయ్య టీ1 స్మార్ట్ఫోన్లను ఉపయోగించాలని తమ దేశ పౌరులను రష్యా కోరడం గమనార్హం.
ఈ స్మార్ట్ఫోన్లలో యూజర్స్‌పై ఇతరులు నిఘా పెట్టకుండా ఉండడానికి కెమెరాలు, మైక్రోపోన్ను టర్న్ ఆఫ్ చేసేలా ప్రత్యేక హార్డ్‌వేర్ బటన్‌ను తీసుకువస్తున్నట్లు సమాచారం. తమపై నిఘా పెట్టాలనుకునే వ్యక్తుల ఫోన్ల మైక్రోఫోన్, కెమెరాలను అయ్యా టీ1 స్వయంగా టర్న్ ఆఫ్ చేసేస్తుందట.
అయితే ఈ ఫోన్ ధర సుమారు 15 నుంచి 19 వేల రూబెల్స్ ఉంటుందని తెలుస్తోంది. ఈ ఫోన్లో అత్యాధునిక ఫీచర్స్‌ను జోడించింది కంపెనీ. ఈ ఫోన్ త్వరలో మొబైల్ ఆండ్రాయిడ్ ఓఎస్ నుంచి రష్యన్ తయారు చేసిన అరోరా ఆపరేటింగ్ సిస్టమ్ కూడా పనిచేయనుందని సమాచారం. ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్, మీడియాటెక్ హిలీయో పీ70 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. 6.5 అంగుళాల సైజు, 4జీబీ ర్యామ్, 64 ఇంటర్నల్ స్టోరేజీ, 4000ఎంఏహెచ్ బ్యాటరీ, రెండు ప్రధాన కెమెరాలు, 12ఎంపీ, 5ఎంపీ డిజిటల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో అందుబాటులోకి తీసుకురానుంది.