Russia-Ukraine war:గూగుల్ ఈ ఫీచర్ నిలిపివేత, రష్యా ప్రభుత్వ యాడ్స్ పై కూడా బ్యాన్..
యూట్యూబ్‌తో పాటు, రష్యన్ స్టేట్ మీడియా వెబ్‌సైట్, యాప్స్ ప్రకటనలను కూడా గూగుల్ నిషేధించింది. ఇంతకుముందు ఫేస్‌బుక్ రష్యన్ స్టేట్ మీడియా ఫేస్‌బుక్ పేజీని కూడా డీమోనిటైజ్ చేసింది.
రష్యా -ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో రష్యాపై గూగుల్ చాలా కఠినమైన చర్యలు తీసుకుంది. ఉక్రెయిన్‌లో గూగుల్ మ్యాప్స్ లైవ్ ఫీచర్‌ను తాత్కాలికంగా ఆఫ్ చేసింది. ఉక్రెయిన్ పౌరుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు గూగుల్ తెలిపింది. గూగుల్ మ్యాప్స్ లైవ్ ఫీచర్‌తో వినియోగదారులు ట్రాఫిక్ గురించి లైవ్ సమాచారాన్ని పొందుతారు. లోకల్ అడ్మినిస్ట్రేటర్ తో మాట్లాడిన తర్వాత గూగుల్ ఈ చర్య తీసుకుంది.
యూట్యూబ్ ఛానెల్ ప్రకటనల నిషేధం
ఉక్రెయిన్‌లో గూగుల్ మ్యాప్స్ లైవ్ ఫీచర్‌ను తాత్కాలికంగా మూసివేసిన తర్వాత, గూగుల్ రష్యా ప్రభుత్వ-అధికార మీడియా సంస్థ ఆర్‌టి అండ్ ఇతర ఛానెల్‌లను యూట్యూబ్ లో డీమోనిటైజ్ చేసింది, అంటే మీరు ఈ యూట్యూబ్ ఛానెల్ లలో వచ్చే ప్రకటనల నుండి డబ్బు సంపాదించలేరు. యూట్యూబ్ కాకుండా రష్యన్ స్టేట్ మీడియా వెబ్‌సైట్, యాప్ యాడ్స్ ని కూడా గూగుల్ నిషేధించింది. ఇంతకుముందు ఫేస్‌బుక్ రష్యన్ స్టేట్ మీడియా ఫేస్‌బుక్ పేజీని కూడా డీమోనిటైజ్ చేసింది.
ఎండబల్యూసి 2022 నుండి ఉక్రెయిన్ అవుట్
ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత, ఎండబల్యూసి 2022లో రష్యన్ కంపెనీల ఎంట్రీని నిలిపివేయబడింది. ఈ ఈవెంట్‌లో ఏ రష్యన్ కంపెనీ స్టాల్స్ ఉండవని ఎండబల్యూసి నిర్వాహకులు తెలిపారు. రష్యాపై అమెరికా విధించిన కొన్ని అంతర్జాతీయ ఆంక్షల తర్వాత ఎండబల్యూసి నుండి రష్యన్ కంపెనీలను నిలిపివేయలని నిర్ణయం తీసుకోబడింది. రష్యాకు చెందిన బ్రాండ్‌ల ఉత్పత్తులపై కూడా యూఎస్ ఈ నిషేధాన్ని విధించింది, అయితే ఉత్పత్తి మాత్రం అమెరికాలో జరుగుతుంది.
ఈ నిషేధం వల్ల అమెరికా కంపెనీలకు భారీ నష్టం వాటిల్లుతుంది. అమెరికా వాణిజ్య చట్టం కింద అమెరికా ఈ ఆంక్షలు విధించింది. యూఎస్ కంపెనీలు ఇప్పుడు కంప్యూటర్లు, సెన్సార్లు, లేజర్లు, నావిగేషన్ ఎక్విప్మెంట్, టెలికమ్యూనికేషన్స్, ఏరోస్పేస్ అండ్ మేరైన్ ఎక్విప్మెంట్లను రష్యాకు విక్రయించడానికి లైసెన్స్‌లను పొందాలి. కొన్నేళ్ల క్రితం చైనా కంపెనీ హువావేపై అమెరికా ఇదే విధమైన నిషేధాన్ని విధించింది, దీని వల్ల హువావేకి చాలా నష్టం జరిగింది.
సైబర్ వార్
ఉక్రెయిన్‌లోని ప్రభుత్వ వెబ్‌సైట్‌పైనా, బ్యాంకులపైనా రెండు దేశాల మధ్య వార్ కొనసాగుతున్న నేపథ్యంలో తరచూ సైబర్ దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ పార్లమెంట్ అండ్ ఇతర ప్రభుత్వ ఇంకా బ్యాంకింగ్ వెబ్‌సైట్‌లపై గత వారం సైబర్ దాడులు జరిగాయి. ఈ దాడి తర్వాత, సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు గుర్తు తెలియని దాడితో ప్రమాదకరమైన మాల్వేర్ వందలాది కంప్యూటర్‌లకు సోకినట్లు చెప్పారు. మాల్వేర్ సోకిన కంప్యూటర్లు కొన్ని పొరుగున ఉన్న లాట్వియా, లిథువేనియాలో ఉన్నాయని పరిశోధకులు తెలిపారు.