జియో ఎయిర్‌ఫైబర్.. ఈ స్పెషల్ డివైజ్ ఏంటి, ఎలా పని చేస్తుంది ?

జియో ఎయిర్‌ఫైబర్ డివైజ్ ని కంపెనీ గతంలో లాంచ్ చేసిన వై-ఫై డివైజ్ జియోఫైకి లేటెస్ట్ వెర్షన్‌గా పరిచయం చేసింది. ఈ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ తో ఇంటర్నెట్ 2Gbps వరకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది.

Reliance Jio launches JioAirFiber to agm 2022 let users create 5G hotspots at homes, offices

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 45వ ఆన్యువల్ జనరల్ మీటింగ్  (AGM 2022) ఈరోజు జరిగింది. ఈ సమావేశంలో జియో 5జీ సేవలను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. Jio 5G సేవలతో పాటు, Jio AirFiber డివైజ్ కూడా ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ డివైజ్ సహాయంతో అల్ట్రా ఫాస్ట్ స్పీడ్ 5G ఇంటర్నెట్ కనెక్టివిటీని ఆఫీసులో, ఇంట్లో ఉపయోగించవచ్చు. ఎయిర్‌ఫైబర్ ద్వారా కస్టమర్లు వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ పొందుతారు.  

జియో ఎయిర్‌ఫైబర్ వైర్‌లెస్ అంటే ఏమిటి
జియో ఎయిర్‌ఫైబర్ డివైజ్ ని కంపెనీ గతంలో లాంచ్ చేసిన వై-ఫై డివైజ్ జియోఫైకి లేటెస్ట్ వెర్షన్‌గా పరిచయం చేసింది. ఈ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ తో ఇంటర్నెట్ 2Gbps వరకు అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. ఈ వైర్‌లెస్ డివైజ్ ని ఇళ్ళలో పాటు ఆఫీసులో కూడా ఉపయోగించవచ్చు. హాట్‌స్పాట్ డివైజ్ Jio AirFiberని కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు అలాగే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT) డివైజ్లకు సులభంగా కనెక్ట్ చేయవచ్చు. 

Jio AirFiber డివైజ్ తో ఇంటర్నెట్‌ని ఇంటి అంతటా అతి వేగవంతమైన ఇంటర్నెట్‌ ఉపయోగించవచ్చు. ఈ డివైజ్‌తో హై ఎండ్ గేమింగ్, హై క్వాలిటీ వీడియోలను కూడా ఎలాంటి లాగ్ లేకుండా ప్లే చేసుకోవచ్చు. ఈ డివైజ్ నుండి కస్టమర్లు ఎండ్-టు-ఎండ్ బ్రాడ్‌బ్యాండ్ (వైర్‌లెస్) సోల్యూషన్స్ పొందుతారని కంపెనీ పేర్కొంది. అంటే, హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం మీకు మరే ఇతర డివైజెస్ అవసరం లేదు. ఇది పోర్టబుల్ వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ అవుతుంది, మీరు దీన్ని సులభంగా సెటప్ చేయవచ్చు, ఉపయోగించవచ్చు. 

ప్రస్తుతం, జియో 5జి ప్లాన్‌ల ధరలను వెల్లడించలేదు. డిసెంబర్ 2023 నాటికి ఇండియాలోని అన్ని పట్టణాలను 5G కనెక్టివిటీతో కవర్ చేయాలని జియో భావిస్తోంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios