Asianet News TeluguAsianet News Telugu

పారాహుషార్!!12న జియో గిగాఫైబర్​ లాంచింగ్: బీవేర్ విత్ ఫిషింగ్ మెయిల్స్​ !

రిలయన్స్ జియో గిగా ఫైబర్ సర్వీసు కోసం ఆసక్తిగా ఎదురుచూసే వారి కోసం మోసగాళ్లు ‘ఫిషింగ్ మెయిల్స్’ సిద్ధంగా ఉన్నారని, జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

Reliance Jio GigaFiber fake activation request emails being circulated ahead of official launch
Author
New Delhi, First Published Aug 4, 2019, 11:52 AM IST

జియో గిగా ఫైబర్​...! రిలయన్స్​ అధినేత ముకేశ్ అంబానీ నుంచి వస్తున్న మరో సంచలనం. ఒకే కనెక్షన్​తో హైస్పీడ్​ ఇంటర్నెట్​, ల్యాండ్​లైన్​, డీటీహెచ్ సేవలు అందించడం గిగా ఫైబర్​ ప్రత్యేకత. ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉన్న గిగా ఫైబర్​... ఆగస్టు 12 నుంచి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.

ముకేశ్​ అంబానీ రిలయన్స్ జియో గిగా ఫైబర్​ సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని గతేడాది ప్రకటించారు. అప్పటి నుంచి లక్షల మంది దీనికోసం ఎదురుచూస్తున్నారు. ఇదే అవకాశంగా తీసుకుని కొంత మంది మోసగాళ్లు (స్కామర్లు) హానికరమైన ఈ-మెయిల్స్ (ఫిషింగ్ మెయిల్స్)తో జియో వినియోగదారులను మోసగించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

మోసం అంటే ఏమిటో తెలుసుకునే ముందు ‘ఫిషింగ్ మెయిల్’లో ఫిషింగ్ అర్థం తెలుసుకోవడం అవసరం. ‘ఫిషింగ్’ అనేది టెక్నాలజీ భాషలో 'వంచన', 'చౌర్యం' అని అర్థం .ఫిషింగ్ చేసే హ్యాకర్​ లేదా స్కామర్​ ముందుగా మిమ్మల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తాడు. అందుకోసం ఒరిజినల్​ వెబ్​సైట్​ను పోలిన వెబ్​సైట్​ను రూపొందిస్తాడు.

మోసగాడు తరువాత మీ బ్యాంకు ఖాతా సమాచారం, పాస్​వర్డ్​లు, వ్యక్తిగత సమాచారం, సున్నితమైన డేటాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఒకసారి సమాచారం అంతా సేకరించాడంటే, ఇంకేముంది మీ బ్యాంకు ఖాతాలోని డబ్బు గల్లంతే.

జియో గిగాఫైబర్​ విషయానికి వస్తే... స్కామర్లు మొదటగా తాము సంస్థ ప్రతినిధులమని నమ్మిస్తారు. గిగా ఫైబర్​ రిజిస్ట్రేషన్ల పేరిట ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తారు. వీటిలో సబ్జెక్ట్​ గిగాఫైబర్ యాక్టివేషన్​ రిక్వెస్ట్ స్వీకరించాం అని ఉంటుంది. మెయిల్​లో జియో డిజిటల్ లైఫ్ మాస్ట్​హెడ్ ఉంటుంది.

గిగాఫైబర్ ప్లాన్​లతోపాటు వినియోగదారులు తమ సభ్యత్వాన్ని ధ్రువీకరించే లింకులు కూడా ఉంటాయి. ఇలాంటి మెయిల్స్ వస్తే కచ్చితంగా వాటిని తెరవవద్దు. ఏమరుపాటు వద్దుస్కామర్లు జియో ఉపయోగించే ఫాంట్​లు, గ్రాఫిక్​లనే ఉపయోగించి ఫిషింగ్ మెయిల్స్ పంపిస్తారు. 

ఇది నిజంగా జియోనే పంపించిందనే భ్రమ కల్పించి మిమ్మల్ని బురిడీ కొట్టించడానికి ప్రయత్నిస్తారు. కానీ నిశితంగా పరిశీలిస్తే అది నిజమైనదా? లేదా? అనేది మీరే గుర్తించగలరు. కనుక అనుమానాస్పదంగా కనిపిస్తే అలాంటి మెయిల్స్​ను స్పామ్​లో పడేస్తే సరి.

Follow Us:
Download App:
  • android
  • ios