న్యూఢిల్లీ‌: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ షియోమీ తన నోట్‌ సిరీస్‌ కొత్త మొబైల్స్‌ను విపణిలోకి విడుదల చేసింది. రెడ్‌మీ నోట్‌7 ఫోన్‌కు సక్సెసర్‌గా రెడ్‌మీ నోట్‌ 8 మొబైళ్లను షావోమీ విడుదల చేసింది. చైనాలో జరిగిన కార్యక్రమంలో వీటిని ఆవిష్కరించారు. రెడ్‌మీ నోట్ ‌8, రెడ్‌మీ నోట్ ‌8 ప్రో ఫోన్ 64 ఎంపీ కెమెరాతో కలిసి మొత్తం నాలుగు కెమెరాలతో వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది.

రెడ్‌మీ నోట్‌8ప్రోను మూడు వేరియంట్లలో విడుదల చేశారు. 6జీబీ ర్యామ్‌ విత్ 64 అంతర్గత మెమొరీ మోడల్‌ ధరను భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.14వేలుగా నిర్ణయించారు. 6జీబీ విత్ 128జీబీ రూ.16వేలు, 8జీబీ విత్ 128 జీబీ వెర్షన్ ఫోన్ ఖరీదు రూ.18వేలుగా ఉండొచ్చని తెలుస్తోంది. 

మీడియాటెక్‌ గేమింగ్‌ ఫోకస్‌డ్‌ ‘హీలియో జీ90టీ’ ప్రాసెసర్‌ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్‌9 ‘పై’ ఆధారంగా పనిచేస్తుంది. 6.53 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌, బ్యాకప్ నాలుగు కెమెరాలు ఉంటాయి. వాటిలో 64 మెగా పిక్సెల్‌ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, మిగతా రెండు 2 ఎంపీ కెమెరాలు కలిగి ఉన్నాయి.

ఫ్రంట్ 20 ఎంపీ  కెమెరా కలిగి ఉంటుంది. 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ మొబైల్‌లో గేమ్‌ సెంట్రిక్‌ ప్రత్యేకతలు ఉన్న టర్బో 2.0మోడ్‌ టెక్నాలజీ అందుబాటులో ఉంది. సెప్టెంబర్‌ 3న ఈ మొబైల్‌ అమ్మకాలు మొదలవుతాయి.

మరోవైపు రెడ్‌మీ నోట్‌ 8 ఫోన్‌ను మూడు వేరియంట్లలో విడుదల చేశారు. 4జీబీ ర్యామ్‌ +64 జీబీ అంతర్గత మెమొరీ ధరను భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.10 వేలుగా నిర్ణయించారు. 6జీబీ విత్ 64 జీబీ వెర్షన్‌ సుమారు రూ.12 వేలు, 6జీబీ విత్ 128జీబీ వెర్షన్‌ ఫోన్ ధర రూ.14 వేలు వరకు ఉండొచ్చని తెలుస్తోంది.

రెడ్ మీ నోట్ 8 ఫోన్లలో క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌ ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఆధారంగా పనిచేసే ఈ ఫోన్‌కు 6.39 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ స్క్రీన్‌,  బ్యాకప్ నాలుగు కెమెరాలు ఉంటాయి. వాటిలో 48 మెగా పిక్సెల్‌ ప్రైమరీ కెమెరా, 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, రెండు 2 మెగాపిక్సెల్‌  కెమెరాలు ఉంటాయి. 

రెడ్ మీ నోట్ 8 ఫోన్‌కు 13 ఎంపీ సామర్థ్ంయ గల ఫ్రంట్ కెమెరా ఉంటుంది. 4000 ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. వచ్చేనెల 17న ఈ మొబైల్‌లో అమ్మకాలు ప్రారంభం అవుతాయి. మన దేశంలో ఎప్పటి నుంచి అమ్మకాలు ప్రారంభం అవుతాయో సంస్థ వెల్లడించలేదు. అయితే వచ్చే నెల ద్వితీయార్ధంలో భారత మార్కెట్‌లో రెడ్‌మినోట్‌ 8 మొబైల్స్‌ చూడొచ్చని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి.