బీజింగ్: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ సబ్‌బ్రాండ్ రెడ్‌మీ నుంచి వచ్చేవారం మార్కెట్లోకి ప్రవేశఫెట్టనున్న ‘నోట్ 8 ప్రొ’లో లిక్విడ్ కూలింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టినట్టు తెలుస్తోంది. ఫలితంగా ఫోన్- 4 నుంచి 6 డిగ్రీలు చల్లగా ఉండనుంది. ఎక్కువ సేపు వాడినప్పుడు కూడా ఫోన్ వేడెక్కకుండా ఈ ఫీచర్ అడ్డుకుంటుందని ‘జీఎస్ఎం ఎరీనా’ పేర్కొంది.

రెడ్ మీ నోట్ 8 ప్రొలో సరికొత్త హీలియో జీ90టీ చిప్‌సెట్‌ను ఉపయోగించినట్టు చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబో తెలిపింది. అలాగే, ఈ ఫోన్‌లో బ్యాక్ క్వాడ్ రేర్ కెమెరాలు మూడు, కుడివైపున నాలుగో కెమెరా ఉన్నట్టు వీబో పేర్కొంది. దీంతోపాటు వెనక ఫింగర్ ప్రింట్ స్కానర్, గ్లాస్-శాండ్‌విచ్ డిజైన్ ఉన్నట్టు తెలుస్తోంది. 

ఈ నెల 29న చైనాలో నోట్ 8, నోట్ 8ప్రొ, రెడ్‌మీ టీవిలను రెడ్‌మీ విడుదల చేయబోతోంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 665 చిప్ సెట్ వినియోగంలోకి తేనున్నది. అంతేకాదు రెడ్ మీ రెండు విబినన కెమెరా మాడ్యూల్స్‌ డిజైన్స్ వాడనున్నది. రెడ్ మీ నోట్ 7 సిరీస్‌లో మాదిరిగా రెడ్ మీ నోట్ 8 ఫోన్లోనూ 48 ఎంపీ కెమెరా, వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా మాదిరిగా ఉంటాయి.