రియల్ మీ జి‌టి నియో 3 vs వన్ ప్లస్ 10ఆర్ 5జి: వీటిలో మీకు బెస్ట్ ఫోన్ ఏదంటే..?

 రియల్ మీ జి‌టి నియో 3లో డైమెన్సిటీ 8100 5G ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ రెండు ఫోన్‌ల డిస్‌ప్లే సైజ్ ఒకేలా ఉంటుంది అంటే 6.7 అంగుళాలు. 

Realme GT Neo 3 vs OnePlus 10R 5G: Which is best for you

రియల్ మీ జి‌టి నియో 3, వన్ ప్లస్ 10ఆర్ 5జి ఇండియాలో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్‌లకు 150W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. వన్ ప్లస్ 10ఆర్ 5జిలో డైమెన్సిటీ 8100-మాక్స్ ప్రాసెసర్‌ ఉండగా, రియల్ మీ జి‌టి నియో 3లో డైమెన్సిటీ 8100 5G ప్రాసెసర్‌తో వస్తుంది. ఈ రెండు ఫోన్‌ల డిస్‌ప్లే సైజ్ ఒకేలా ఉంటుంది అంటే 6.7 అంగుళాలు. ఈ రెండింటిలో మీకు ఏది బెస్ట్ ఫోన్ అంటే..

స్పెసిఫికేషన్‌లు
రియల్ మీ జి‌టి నియో 3 Android 12 ఆధారిత Realme UI 3.0 ఉంది. 1080x2412 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లే, డిస్ప్లేతో HDR10+ అండ్ డి‌సి డిమ్మింగ్ సపోర్ట్ ఉంది. MediaTek డైమెన్సిటీ 8100 5G ప్రాసెసర్‌తో గరిష్టంగా 12జి‌బి వరకు LPDDR5 ర్యామ్  ఉంది. ఫోన్‌లో కెమెరా అండ్ బ్యాటరీ కోసం ప్రత్యేక చిప్‌సెట్‌లు ఇచ్చారు అంటే ఈ ఫోన్‌లో మూడు ప్రాసెసర్‌లు ఉన్నాయి. ఇంకా స్టీల్ వేపర్ కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది.

వన్ ప్లస్ 10ఆర్ 5జి Android 12 ఆధారిత ColorOS 12.1 పై రన్ అవుతుంది. 1080x2412 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల HD+ AMOLED డిస్‌ప్లే ఉంది. డిస్ప్లే రిఫ్రెష్ రేట్ 120Hz. దీని బ్రైట్ నెస్ 950 నిట్స్ అండ్ డిస్ప్లే 2.5D కర్వ్డ్ గొరిల్లా గ్లాస్ 5 ద్వారా ప్రొటెక్ట్ చేయబడుతుంది. OnePlus Ace, MediaTek Dimensity 8100-Max ప్రాసెసర్‌తో 12జి‌బి వరకు LPDDR5 ర్యామ్, 512జి‌బి  వరకు స్టోరేజీ ఉంది.

 కెమెరా
రియల్ మీ జి‌టి నియో 3లో మూడు బ్యాక్ కెమెరాలు ఉంటాయి, దీనిలో ప్రైమరీ లెన్స్ 50-మెగాపిక్సెల్ Sony IMX766 సెన్సార్‌, దీంతో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) కూడా రానుంది. రెండవ లెన్స్ 8-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ మూడవ లెన్స్‌గా ఇచ్చారు. సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

వన్ ప్లస్ 10ఆర్ 5జిలో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ప్రైమరీ లెన్స్ 50-మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్. దీనితో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి సపోర్ట్ కూడా ఉంది. రెండవ లెన్స్ 8-మెగాపిక్సెల్ సోనీ IMX355 అల్ట్రా వైడ్, మూడవ లెన్స్ 2-మెగాపిక్సెల్ GC02M1 మాక్రో సెన్సార్. సెల్ఫీ కోసం 16-మెగాపిక్సెల్ Samsung ISOCELL S5K3P9 సెన్సార్‌ ఉంది.

బ్యాటరీ
కనెక్టివిటీ కోసం, OnePlus 10R 5Gలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంది. 150W సూపర్ ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 4500mAh డ్యూయల్ సెల్ బ్యాటరీ ఉంది.
Realme GT Neo 3లో 150W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 4500mAh బ్యాటరీ ఇచ్చారు. ఈ ఛార్జర్ 5 నిమిషాల్లో 50% బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. రెండవ వేరియంట్ 5000mAh బ్యాటరీని పొందుతుంది, దీనిలో 80W ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. ఫోన్ బరువు 188 గ్రాములు. కనెక్టివిటీ కోసం 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS/ A-GPS, NFC, USB టైప్-C పోర్ట్‌ కూడా  ఉంది.

 ధర
వన్ ప్లస్ 10ఆర్ 5జి 8 జి‌బి ర్యామ్ తో 128జి‌బి స్టోరేజ్ ధర రూ. 38,999. ఈ వేరియంట్ 80W SuperVOOC ఛార్జింగ్‌తో వస్తుంది.  256 జి‌బి స్టోరేజ్ 12 జి‌బి ర్యామ్ తో 80W SuperVOOC వేరియంట్ ధర రూ. 42,999. వన్ ప్లస్ 10ఆర్ 5జి ఎండ్యూరెన్స్ ఎడిషన్ అండ్ 150W SuperVOOC ధర రూ. 43,999. ఈ ధరలో 12జి‌బి  ర్యామ్ తో 256 జి‌బి స్టోరేజ్ లభిస్తుంది.

రియల్ మీ జి‌టి నియో 3 8 జి‌బి ర్యామ్‌తో 128జి‌బి స్టోరేజ్ ధర రూ. 36,999. 8 జీబీ ర్యామ్‌తో కూడిన 256 జీబీ స్టోరేజ్ ధర రూ.38,999గా ఉంది. Realme GT Neo 3 150W వేరియంట్ 12జి‌బి ర్యామ్‌తో 256 జి‌బి స్టోరేజ్ ధర రూ. 42,999. ఈ ఫోన్‌ను మే 4 నుండి అస్ఫాల్ట్ బ్లాక్, నైట్రో బ్లూ, స్పింట్ బ్లూ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios