అల్ట్రా స్లిమ్ డిజైన్‌తో రియల్ మీ బడ్జెట్ ఫోన్.. బెస్ట్ ఫీచర్లు, గొప్ప కెమెరా కూడా..
రియల్ మీ సి30ఎస్ స్ట్రైప్ బ్లూ, స్ట్రైప్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో పరిచయం చేసారు. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది, ఇందులో 2జిబి ర్యామ్ 32జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499 కాగా, 4జిబి ర్యామ్ తో కూడిన 64జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999.
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ ఇండియా కొత్త ఎంట్రీ లెవల్ ఫోన్ రియల్ మీ సి30ఎస్ ని ఇండియాలో లాంచ్ చేసింది. ఈ రియల్ మీ సి30ఎస్ ని అల్ట్రా స్లిమ్ డిజైన్‌తో పరిచయం చేసారు. ఫోన్‌లో ఆక్టాకోర్ యూనిసోక్ SC9863A ప్రాసెసర్‌తో 5000mAh బ్యాటరీ ఇచ్చారు. రియల్ మీ సి30ఎస్ లో 8-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా లభిస్తుంది.
రియల్ మీ సి30ఎస్ ధర
రియల్ మీ సి30ఎస్ స్ట్రైప్ బ్లూ, స్ట్రైప్ బ్లాక్ అనే రెండు కలర్ ఆప్షన్లలో పరిచయం చేసారు. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది, ఇందులో 2జిబి ర్యామ్ 32జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.7,499 కాగా, 4జిబి ర్యామ్ తో కూడిన 64జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.8,999. సెప్టెంబర్ 23 నుండి మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ఇంకా కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్ నుండి ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ ఫోన్‌ని ఒక రోజు ముందుగా అంటే సెప్టెంబర్ 22 మధ్యాహ్నం 12 గంటల నుండి కొనుగోలు చేసే ఛాన్స్ కల్పించారు.
రియల్ మీ సి30ఎస్ స్పెసిఫికేషన్‌లు
రియల్ మీ సి30ఎస్ అండ్రాయిడ్ 12 రియల్ మీ యూఐ గో పొందుతుంది. 6.5-అంగుళాల HD+ డిస్‌ప్లే, 720x1,600 పిక్సెల్ రిజల్యూషన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 400 nits బ్రైట్ నెస్ కూడా డిస్ ప్లేతో సపోర్ట్ చేస్తుంది. ఫోన్‌లో ఆక్టాకోర్ యూనిసోక్ SC9863A ప్రాసెసర్‌తో 64జిబి స్టోరేజ్ అండ్ 4జిబి ర్యామ్ ఉంది. మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో స్టోరేజీని 1టిబి వరకు పెంచుకోవచ్చు.
రియల్ మీ సి30ఎస్ కెమెరా
ఈ ఫోన్‌లో సింగిల్ కెమెరా అంటే 8 మెగాపిక్సెల్ ఏఐ సపోర్ట్ తో వస్తుంది. కెమెరాతో 1080p 30FPS వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇచ్చారు అలాగే, ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. హెచ్‌డిఆర్ ఇంకా బ్యూటీ ఫిల్టర్‌లు కెమెరాతో సపోర్ట్ చేస్తాయి.
బ్యాటరీ
రియల్ మీ సి30ఎస్ 5,000mAh బ్యాటరీ పొందుతుంది, ఇంకా 10W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ కోసం ఫోన్ 4జి VoLTE, 4G LTE, WCDMA, GSM, 3G, 2G, బ్లూటూత్ v4.2, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఇంకా మైక్రో యూఎస్‌బి పోర్ట్‌లకు సపోర్ట్ చేస్తుంది.