Asianet News TeluguAsianet News Telugu

నాలుగు కెమెరాల స్మార్ట్ ఫోన్: రూ.10వేల లోపే.. ఆఫర్లూ ఫుష్కలమే


భారత విపణిలోకి ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌ మీ 5ప్రో, రియల్‌ మీ 5 విడుదల చేసింది. వివిధ రకాల మోడల్ ఫోన్ల ప్రారంభ ధరలు రూ.10 వేల లోపే ఉంటాయి. అంతే కాదు పలు రకాల ఆకర్షణీయ ఆఫర్లతో రియల్ మీ వినియోగదారుల ముంగిట్లోకి వస్తోంది.

Realme 5, Realme 5 Pro launched in India with quad cameras: Price in India, specs and release date
Author
New Delhi, First Published Aug 21, 2019, 11:20 AM IST

న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్‌ ఫోన్ల తయారీ సంస్థ రియల్‌ వరుస మొబైల్‌ ఫోన్ల ఆవిష్కరణతో విపణిలోకి దూసుకుపోతున్నది. మంగళవారం మిడ్‌ రేంజ్‌లో రియల్‌ మీ మరో రెండు స్మార్ట్‌ ఫోన్లను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. రియల్‌ మీ 5 ప్రో, రియల్‌ మీ 5 పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్లు నాలుగు కెమెరాలు కలిగి ఉండటం విశేషం. 

రూ.10వేల లోపు ధరకే మొబైల్‌ శ్రేణిలో నాలుగు కెమెరాలతో విపణిలోకి వస్తున్న ఏకైక ఫోన్‌గా రియల్‌ మీ5 రికార్డు సృష్టించింది. ఇక రియల్‌ 5 ప్రో ఫోన్ మూడు వేరియంట్లలో లభించనుంది. 4జీబీ ర్యామ్‌ విత్ 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌ ధరను రూ.13,999గా నిర్ణయించారు. 

6జీబీ ర్యామ్‌ విత్ 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌, 8జీబీ ర్యామ్‌ విత్128జీబీ అంతర్గత మెమొరీ గల రియల్ మీ 5 ప్రో ఫోన్ల ధరలను వరుసగా రూ.14,999, రూ.16,999గా నిర్ణయించారు. 

ఇక 3జీబీ ర్యామ్‌ విత్ 32జీబీ ఇంటర్నల్‌స్టోరేజ్ గల రియల్‌మీ 5 ఫోన్ ప్రారంభ ధర రూ.9,999గా నిర్ణయించింది. 4 జీబీ ర్యామ్‌ విత్ 64 జీబీ ర్యామ్ స్టోరేజీ సామర్థ్యం గల వేరియంట్‌ 10,999, 4జీబీ ర్యామ్‌ విత్ 128 జీబీ ర్యామ్ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌ ధరను రూ.11,999గా నిర్ణయించారు.

వచ్చేనెల 4వ తేదీ నుంచి ఈ ఫోన్లను ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు, రియల్‌ మి.కామ్‌లోనూ అందుబాటులోకి రానున్నాయి. ఇక రియల్‌ మి5 ఈ నెల 27వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి రానుంది. 

రియల్‌ మీ5 ప్రో ఫోన్ ప్రారంభ ఆఫర్‌ కింద జియో వినియోగదారులు రూ.7వేల విలువైన ప్రయోజనాలను పొందవచ్చు. వడ్డీ రహిత వాయిదాలు, ఫ్లిప్‌కార్ట్‌ అందించే పూర్తి మొబైల్ ప్రొటెక్షన్‌, పేటీఎం ఫస్ట్‌ మెంబర్‌ షిప్‌తో పాటు, పేటీఎం యూపీఐ ద్వారా కొనుగోలు చేసే వారు రూ.2వేల వరకూ క్యాష్‌ బ్యాక్‌ను పొందవచ్చు.  అయితే రియల్ ‌5 ఫోన్‌పై ఏ ఆఫర్లను రియల్ మీ ప్రకటించలేదు.

రియల్‌ 5 ప్రో ఫోన్ 6.3 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ డిస్‌ప్లేతోపాటు  కార్నింగ్‌ గోరిల్లా గ్లాస్‌ 3 ప్లస్ ప్రొటెక్షన్‌ కలిగి ఉంటుంది.  ఇంకా స్నాప్‌డ్రాగన్‌ 712 ప్రాసెసర్‌, 2.3గిగాహెడ్జ్‌ క్లాక్‌ స్పీడ్‌ సౌకర్యం ఉంది. 

రియల్ మీ 5 ప్రో ఫోన్‌లో బ్యాక్ 48+8+2+2 మెగాపిక్సెల్స్‌ కలిగిన నాలుగు కెమెరాలు ఉంటాయి. 48 ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ వైడ్‌ యాంగిల్‌ సెన్సార్‌, 2ఎంపీ మాక్రో సెన్సార్‌, 2 ఎంపీ పోట్రేట్‌ సెన్సార్‌ కెమెరాలు ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ 16మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఫీచర్ కూడా ఉంది. 

రియల్ మీ 5 ప్రో ఫోన్‌లో 4జీబీ నుంచి  8జీబీ ర్యామ్ సామర్థ్యం వీటి సొంతం. ఈ ఫోన్లను  మెమొరీ కార్డు సాయంతో 256జీబీ వరకూ స్టోరేజ్‌ను పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. 4,035ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీ ఫీచర్ అందుబాటులో ఉంది. టైప్‌-సి పోర్ట్‌ గల ఈ ఫోన్‌కు వూక్‌ 3.0 ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సౌకర్యం కూడా ఉన్నది. 

రియల్‌ మి5 ఫోన్  6.5 అంగుళాల హెడ్‌ ప్లస్ డిస్‌ప్లేతోపాటు స్నాప్‌డ్రాగన్‌ 665 ప్రాసెసర్‌ కలిగి ఉంటుంది. 3 జీబీ ర్యామ్ నుంచి 62 జీబీ ర్యామ్ వరకు సామర్థ్యం గల ఈ ఫోన్లలో మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 256జీబీ వరకూ మెమొరీని పెంచుకునే వెసులుబాటు అందుబాటులో ఉంది. 

రియల్ మీ 5 ఫోన్ బ్యాక్‌లో 12+8+2+2 మెగాపిక్సెల్స్‌ కలిగిన నాలుగు కెమెరాలు, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్‌ సెల్ఫీ కెమెరా ఫీచర్లు లభ్యం అవుతాయి. ఇంకా ప్రత్యేకించి 5000ఎంఏహెచ్‌ సామర్థ్యం గల బ్యాటరీతోపాటు మైక్రో యూఎస్‌బీ లభిస్తుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios