పబ్-జి కొత్త గేమ్.. లాంచ్ కి ముందే కోటికి పైగా రిజిస్ట్రేషన్లు.. త్వరలో అందుబాటులోకి
పబ్-జి కొత్త గేమ్ లాంచ్ కి సిద్దమైంది. ఈ గేమ్ లో ముఖ్యంగా 2051లో వచ్చే రైళ్లు, ఆయుధాలు, కొత్త మ్యాప్స్ మొదలైన వాటిని చూడవచ్చు.
పబ్-జి గేమ్ డెవలపర్స్ నుండి వస్తున్న కొత్త గేమ్ పబ్-జి : న్యూ స్టేట్ లాంచ్ కి ముందు సంచలనం సృష్టించింది. తాజాగా గూగుల్ ప్లే-స్టోర్‌లో ఈ గేమ్ కోసం కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ సమాచారాన్ని కంపెనీ ట్వీట్ ద్వారా వెల్లడించింది.
ఈ గేమ్ పబ్-జి మొబైల్‌ను భర్తీ చేస్తుందని చెబుతున్నారు. పబ్-జి : న్యూ స్టేట్ గేమ్ రిజిస్ట్రేషన్ ఫిబ్రవరిలో గూగుల్ ప్లే-స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది. అయితే గూగుల్ ప్లే-స్టోర్‌లో భారతీయ వినియోగదారులకు ఈ గేమ్ అందుబాటులో లేదు.
ఫిబ్రవరి నుండి రిజిస్ట్రేషన్లు
పబ్-జి : న్యూ స్టేట్ కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో ప్రీ-రిజిస్ట్రేషన్ ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమైంది. పబ్-జి స్టూడియో ఈ న్యూ స్టేట్ గేమ్ ని తయారు చేసింది. ఈ గేమ్ సంబంధించి యూట్యూబ్‌లో ట్రైలర్ కూడా విడుదల చేసింది. అంతే కాకుండా పబ్-జి : న్యూ స్టేట్ పేరుతో కొత్త వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు కూడా క్రియేట్ చేశారు.
also read మీ ఫోన్‌లో ఈ 8 యాప్స్ ఉంటే వెంటనే డిలెట్ చేయండి.. లేదంటే మీ బ్యాంక్ అక్కౌంట్ హ్యాక్ కావొచ్చు.. ...
ఈ గేమ్ ట్రైలర్‌లో కొన్ని గేమ్ ప్లే, గ్రాఫిక్స్, కొత్త మెకానిక్‌లను చూడవచ్చు. ఈ గేమ్ లో 2051లో వచ్చే రైళ్లు, ఆయుధాలు, కొత్త మ్యాప్స్ మొదలైన వాటిని చూడవచ్చు. ఈ గేమ్ దక్షిణ కొరియా వీడియో గేమింగ్ సంస్థ క్రాఫ్టన్ పబ్లిష్ చేసింది.
భారతదేశంలో పబ్-జి : న్యూ స్టేట్ ప్రారంభించబడుతుందా ?
పబ్-జి కార్పొరేషన్ మాతృ సంస్థ క్రాఫ్టన్ న్యూ స్టేట్ గేమ్ ని తీసుకొస్తుంది. భారతదేశంలో ఈ గేమ్ ప్రారంభించబడదని కంపెనీ తెలిపింది. భారతదేశంలో పబ్-జి : న్యూ స్టేట్ ను ప్రారంభించటానికి ప్రస్తుతం ఎలాంటి ప్రణాళికలు లేవని క్రాఫ్టోన్ ఒక ప్రకటనలో తెలిపింది.
క్రాఫ్టన్ కంపెనీ మాట్లాడుతూ, 'భారతీయ మార్కెట్లో మేము పబ్-జి : న్యూ స్టేట్ కోసం రిజిస్ట్రేషన్ తీసుకోలేదనేది నిజం. భారతదేశంలోని గూగుల్ ప్లే స్టోర్‌లో గేమ్ యాప్ కనిపించినప్పటికీ, వినియోగదారులు రిజిస్ట్రేషన్ చేయలేరు. భారతీయ మార్కెట్ కోసం మేము ప్రస్తుతం పియుబిజి మొబైల్ ఇండియాపై దృష్టి సారించామని కంపెనీ తెలిపింది.