Asianet News TeluguAsianet News Telugu

ఓ మహిళ యూట్యూబ్ ఛానల్ తో 400 కోట్లు.. చివరికి తలలు పట్టుకున్న సబ్ స్క్రైబర్లు, ఫాలోవర్స్...

నివేదిక ప్రకారం, థాయ్‌లాండ్‌కు చెందిన మహిళా యూట్యూబర్  ఆమె సబ్ స్క్రైబర్లని సుమారు రూ.400 కోట్ల మోసం చేసింది. ప్రస్తుతం ఈ మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న ఈ మహిళా యూట్యూబర్ పేరు నాథమన్ ఖోంగ్‌చక్.

Popular YouTuber flees Thailand after allegedly scamming more than 6000 victims out of $55 million
Author
First Published Sep 1, 2022, 4:45 PM IST

కొత్త వ్యక్తులతో కనెక్ట్ అవ్వడానికి ప్రజలు సాధారణంగా సోషల్ మీడియా ఉపయోగిస్తుంటారు, కానీ కొన్నిసార్లు ఈ సోషల్ మీడియా ఎవరికైనా గొంతు అవుతుంది. సోషల్ మీడియాలో వెరైటీ కంటెంట్ కి కొదవలేదు. సోషల్ మీడియాలో  చెడ్డవారు మాత్రమే కాదు  ప్రజలకు సహాయం చేసే మంచి వారు కూడా చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ వంటి వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు కూడా సోషల్ మీడియా కింద లెక్కిస్తారు. మీలో చాలా మంది యూట్యూబ్‌ చూస్తుంటారు, కొంతమందికి స్వంత యూట్యూబ్‌ ఛానెల్ ఉంటుంది మరికొంత మంది యూట్యూబ్‌ని ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే ఉపయోగిస్తారు, అయితే  మీరు యూట్యూబ్ ఇంకా సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలీ. ఎందుకంటే ఒక మహిళా యూట్యూబర్ ప్రజల నుండి 400 కోట్ల మోసం చేసి ఇప్పుడు వారు తలపట్టుకునేల చేసింది.  

నివేదిక ప్రకారం, థాయ్‌లాండ్‌కు చెందిన మహిళా యూట్యూబర్  ఆమె సబ్ స్క్రైబర్లని సుమారు రూ.400 కోట్ల మోసం చేసింది. ప్రస్తుతం ఈ మహిళ పరారీలో ఉన్నట్లు సమాచారం. పరారీలో ఉన్న ఈ మహిళా యూట్యూబర్ పేరు నాథమన్ ఖోంగ్‌చక్. నివేదిక ప్రకారం ఈ మహిళ తన యూట్యూబ్ ఛానెల్‌లో అన్ని రకాల వీడియోలను పోస్ట్ చేసేది. దీంతో తక్కువ సమయంలోనే ఆమె సబ్ స్క్రైబర్లు లక్షల్లో పెరిగారు.

అయితే ఈ మహిళ సబ్ స్క్రైబర్లతో  కూడా  చాట్ చేయడం ప్రారంభించింది. ఒకరోజు  ఆమే తన  సబ్ స్క్రైబర్లతో  నేడు ఒక పెట్టుబడిలో  ఉన్నానని చెప్పింది. ఇంకా ఆమె కంపెనీ పెట్టుబడి ప్లాన్   సబ్ స్క్రైబర్లకు చాలా లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పింది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ ట్రేడింగ్ ద్వారా డబ్బును రెట్టింపు చేస్తానని ఆ మహిళ  సబ్ స్క్రైబర్లకు చెప్పింది.

దీని తర్వాత ఆమె సబ్ స్క్రైబర్లు డబ్బు పంపడం ప్రారంభించారు. పెట్టుబడి కోసం ఈ మహిళకు ఆరు వేల మందికి పైగా సబ్ స్క్రైబర్లు  డబ్బు పంపినట్లు ఒక నివేదికలో పేర్కొన్నారు. కొంతమంది సబ్‌స్క్రైబర్‌లకు ఆమే 35 శాతం వరకు రాబడిని ఇస్తానని చెప్పరు. మొత్తంగా ఈ మహిళకు రూ.400 కోట్లు వచ్చాయి.

కొన్ని రోజుల తర్వాత ఈ మహిళ సోషల్ మీడియా అక్కౌంట్స్, యూట్యూబ్ ఖాతాలన్నింటినీ మూసివేసి అదృశ్యమైంది, అయితే ఈ మహిళ యూట్యూబ్ ఛానెల్‌ని భారతదేశంలో చూడవచ్చు. ప్రస్తుతం ఆమే సబ్ స్క్రైబర్లు చివరికి కలత చెందుతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ప్రస్తుతం, పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు ఇంకా నాథమన్‌పై అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేయబడింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios