Asianet News TeluguAsianet News Telugu

వచ్చే నెల నుంచి ఒప్పొ ‘రెనో 2’ సేల్స్ షురూ..

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ఒప్పొ తన రెనో సిరీస్‌కు కొనసాగింపుగా రెనో 2 ఫోన్‌ను విపణిలోకి తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. రెనో2, రెనో2 జడ్‌, రెనో 2ఎఫ్‌ పేరిట తీసుకొచ్చిన ఈ మూడు ఫోన్లలోనూ 48 మెగాపిక్సల్ కలిగిన క్వాడ్‌ కెమెరాలు ఉన్నాయి. 
 

Oppo Reno 2 Price in India Set at Rs. 36,990, Reno 2Z to Retail at Rs. 29,990: Event Highlights
Author
New Delhi, First Published Aug 29, 2019, 11:54 AM IST

న్యూఢిల్లీ‌: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం ఒప్పొ తన రెనో సిరీస్‌కు కొనసాగింపుగా రెనో 2 ఫోన్‌ను విపణిలోకి తీసుకొచ్చింది. ఈ సిరీస్‌లో మొత్తం మూడు ఫోన్లను భారత్‌లో విడుదల చేసింది. రెనో2, రెనో2 జడ్‌, రెనో 2ఎఫ్‌ పేరిట తీసుకొచ్చిన ఈ మూడు ఫోన్లలోనూ 48 మెగాపిక్సల్ కలిగిన క్వాడ్‌ కెమెరాలు ఉన్నాయి. 

ఒప్పొ రెనో 2 మోడల్‌ ఫోన్ ధరను రూ.36,990గా కంపెనీ నిర్ణయించింది. వచ్చేనెల 20వ తేదీ నుంచి ఈ ఫోన్ అందుబాటులోకి రానున్నది. ఇక రెనో2 జడ్‌ ఫోన్‌ ధరను రూ.29,990గా నిర్ణయించగా.. ఇది సెప్టెంబర్‌ ఆరో తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. రెనో 2ఎఫ్‌ నవంబర్‌లో అందుబాటులోకి తేనున్నట్లు కంపెనీ ఒప్పో తెలిపింది.

రెనో 2ఎఫ్ ఫోన్ ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఒప్పొ రెనో తొలి మోడల్‌ తరహాలోనే రెనో2 కూడా షార్క్‌ఫిన్‌ తరహా కెమెరాతో వస్తుండగా.. మిగిలిన రెండు మోడళ్లూ పాప్‌అప్‌ కెమెరాతో వస్తున్నాయి.

రెనో 2 ఫోన్ 6.5 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తోంది. ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 730జీ ప్రాసెసర్‌ను వినియోగించారు. 8జీబీ/ 256 జీబీ ర్యామ్ సామర్థ్యం గల ఈ ఫోన్‌ ‘ఓషన్‌ బ్లూ’, ‘లుమినియస్‌ బ్లాక్‌’ రంగుల్లో లభ్యం కానున్నది. 

రెనో 2 ఫోన్‌లో 48 ఎంపీ ప్రైమరీ కెమెరాతోపాటు 13 ఎంపీ టెలిఫొటో లెన్స్‌, 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ లెన్స్‌, 2 ఎంపీ మోనో లెన్స్‌ ఉన్నాయి. 5ఎక్స్ వరకు హైబ్రిడ్‌ జూమ్‌, 20 ఎక్స్ వరకు డిజిటల్‌ జూమ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంది. 4,000ఎంఏహెచ్‌ బ్యాటరీ కలిగిన ఈ ఫోన్‌ వూక్‌ 3.0 ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

6.53 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లేతో వస్తున్న రెనో 2జడ్ ఫోన్‌లో మీడియా టెక్‌ హీలియో పీ90 ప్రాసెసర్‌ అమర్చారు. 8జీబీ/256జీబీతో వస్తున్న ఈ ఫోన్‌ కూడా క్వాడ్‌ కెమెరాతో వస్తోంది. ఇందులో 48 ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 586 సెన్సర్‌తో పాటు 8+2+2 ఎంపీల కెమెరాలు ఉన్నాయి. 

ఫ్రంట్ 16 ఎంపీ కెమెరాను అమర్చారు. 4,000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ వూక్‌ 3.0 ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఆండ్రాయిడ్‌ పైతో కలర్‌ ఓఎస్‌ 6.1తో ఇది వస్తోంది.

రెనో 2ఎఫ్‌ ఫోన్ కూడా ఇంచుమించు మిగతా రెండు ఫోన్ల మాదిరిగానే ఉంటుంది. ఇందులో మీడియా టెక్‌ హీలియో పీ70 ప్రాసెసర్‌ను వినియోగించారు. 8జీబీ/128జీబీ స్టోరేజీతో వస్తోంది. ఇది కలర్‌ ఓఎస్‌ 6.0తో పనిచేస్తుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios