వన్‌ప్లస్ మొదటి టాబ్లెట్.. ఒక్కసారి చార్జ్ చేస్తే చాలు.. దీని ఫీచర్స్ అదుర్స్..
కంపెనీ నుండి వస్తున్న మొదటి ప్యాడ్ 11.61-అంగుళాల డిస్ ప్లేతో పరిచయం చేసారు. 2.5D కర్వ్డ్ గ్లాస్, 144Hz రిఫ్రెష్ రేట్, 2800x2000 రిజల్యూషన్, 296 PPI, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది.
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ మొదటి టాబ్లెట్ వన్‌ప్లస్ ప్యాడ్‌ను క్లౌడ్ 11 ఈవెంట్‌లో లాంచ్ చేసింది. కంపెనీ ప్యాడ్‌తో వన్‌ప్లస్ 11 5G, వన్‌ప్లస్ 11R, వన్‌ప్లస్ బడ్స్ ప్రొ 2, వన్‌ప్లస్ టివి 65 Q2 Proలను కూడా విడుదల చేసింది. ఈ ప్యాడ్ 2.5డి కర్వ్డ్ డిస్‌ప్లేతో పరిచయం చేసారు. 65W ఫాస్ట్ ఛార్జింగ్, డైమెన్సిటీ 9000 ప్రాసెసర్ ప్యాడ్‌తో చూడవచ్చు. ప్యాడ్ 12జిబి వరకు ర్యామ్, మాగ్నెటిక్ కీబోర్డ్‌కు సపోర్ట్ చేస్తుంది. ప్యాడ్‌ని హాలో గ్రీన్ కలర్‌లో పరిచయం చేసారు. ప్యాడ్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే రాబోయే వారాల్లో అందుబాటులోకి వస్తుంది. వన్‌ప్లస్ ప్యాడ్ ధర, ఇతర ఫీచర్ల గురించి తెలుసుకుందాం...
వన్‌ప్లస్ ప్యాడ్ స్పెసిఫికేషన్లు
కంపెనీ నుండి వస్తున్న మొదటి ప్యాడ్ 11.61-అంగుళాల డిస్ ప్లేతో పరిచయం చేసారు. 2.5D కర్వ్డ్ గ్లాస్, 144Hz రిఫ్రెష్ రేట్, 2800x2000 రిజల్యూషన్, 296 PPI, 500 నిట్స్ బ్రైట్‌నెస్‌ని అందిస్తుంది. వన్ ప్లస్ ప్యాడ్ 7:5 స్క్రీన్ రేషియో, 88 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో ఉంది. ప్యాడ్ 6.54mm స్లిమ్ డిజైన్‌తో చాలా సన్నగా ఉంటుంది ఇంకా దీని బరువు 552 గ్రాములు.
ప్యాడ్ పవర్ గురించి మాట్లాడితే, MediaTek Dimensity 9000 ప్రాసెసర్, LPDDR5 ర్యామ్ 12జిబి వరకు సపోర్ట్ చేయబడింది. ఆండ్రాయిడ్ 13 ఆధారిత UIతో ప్యాడ్ పరిచయం చేసారు. వన్‌ప్లస్ ప్యాడ్ స్మార్ట్‌ఫోన్‌తో 5G సెల్యులార్ షేరింగ్ కూడా ఉంది. క్వాడ్-స్పీకర్ సెటప్‌తో టాబ్లెట్‌లో డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మోస్ సపోర్ట్ చేయబడ్డాయి.
ప్యాడ్‌తో ఫోటోగ్రఫీ కోసం 13-మెగాపిక్సెల్ సింగిల్ రియర్ కెమెరా అండ్ వీడియో కాలింగ్ కోసం 8-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి. ప్యాడ్ 9,510mAh బ్యాటరీ, 67W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ప్యాడ్‌తో ఒక నెల వరకు స్టాండ్‌బై టైమ్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. కంపెనీ రిటైల్ బాక్స్‌లో మ్యాచింగ్ మాగ్నెటిక్ కీబోర్డ్ అండ్ స్టైలస్‌ను అందించబోతోంది.