వన్ ప్లస్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. సోషల్ మీడియాలో డిజైన్, స్పెసిఫికేషన్స్ లీక్.. ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయంటే..

వన్ ప్లస్ 11R  వన్ ప్లస్ 10Rకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా పరిచయం చేయనున్నారు. ఈ ఫోన్ ని 150W ఛార్జింగ్‌తో ఏప్రిల్ 2022న పరిచయం చేశారు. ఈ ఫోన్ భారతదేశంలో రెండు ఎడిషన్లలో ప్రవేశపెట్టారు, ఇందులో ఒకటి ఎండ్యూరెన్స్ ఎడిషన్ 150W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో మరొకటి 80W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. 

OnePlus 11R Design and specification leak Will get these powerful features

చైనీస్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ వన్ ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ వన్ ప్లస్ 11R 5జి ఇండియాలో ఫిబ్రవరి 7న లాంచ్ కానుంది. దీంతో వన్ ప్లస్  11 సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్  రాబోతుంది.  వన్ ప్లస్ 11R డిజైన్ ఇంకా స్పెసిఫికేషన్ గురించి తాజాగా సమాచారం లీక్ చేయబడింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌తో వస్తున్నట్లు  క్లెయిమ్ చేస్తున్నారు. దీనికి 5,000 mAh బ్యాటరీ, 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్ కూడా ఉంటుంది. 

 ధర
 వన్ ప్లస్ 11R  వన్ ప్లస్ 10Rకి అప్‌గ్రేడ్ వెర్షన్‌గా పరిచయం చేయనున్నారు. ఈ ఫోన్ ని 150W ఛార్జింగ్‌తో ఏప్రిల్ 2022న పరిచయం చేశారు. ఈ ఫోన్ భారతదేశంలో రెండు ఎడిషన్లలో ప్రవేశపెట్టారు, ఇందులో ఒకటి ఎండ్యూరెన్స్ ఎడిషన్ 150W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో మరొకటి 80W సూపర్ VOOC ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.38,999. అదే ధరలో కొత్త వన్ ప్లస్ 11R కూడా లాంచ్ చేయబడుతుందని క్లెయిమ్ చేస్తున్నారు.

ఫీచర్స్  
వన్ ప్లస్ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ గురించి సమాచారం  సోషల్ మీడియాలో  వెల్లడైంది. లీక్ ప్రకారం, ఫోన్ డిజైన్ రెనో 9 ప్రో+ అండ్ వన్‌ప్లస్ 11 ఆధారంగా రూపొందించబడింది. అంటే ఫోన్‌తో పాటు ఐఆర్ బ్లాస్టర్ ఇంకా అలర్ట్ స్లైడర్ ఇవ్వవచ్చు. లీక్‌ల ప్రకారం, ఫోన్ 120Hz ఫుల్ HD ప్లస్ 1.5k కర్వ్డ్ AMOLED PWM డిస్‌ప్లే ప్యానెల్‌ను పొందుతుంది. ఇంకా ఈ  ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్, LPDDR5 ర్యామ్‌తో రవొచ్చు. ఈ ఫోన్ 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరాను పొందుతుంది, అలాగే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది. 5000 mAh బ్యాటరీ, 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ని ఈ ఫోన్‌లో చూడవచ్చు. 

  వన్ ప్లస్ 11 5Gని భారతదేశంలో 7 ఫిబ్రవరి 2023న ప్రారంభించబడుతుంది. అయితే, ఈ ఫోన్ ని దేశీయ మార్కెట్లో జనవరి 4, 2023న  పరిచయం చేయబడుతోంది.  వన్ ప్లస్ 11 5G అనేది  వన్ ప్లస్ 10 అప్‌గ్రేడ్ వెర్షన్‌గా ఉండబోతోంది. లాంచ్ చేయడానికి ముందే, ఫోన్ స్పెసిఫికేషన్ గురించి సమాచారం తెరపైకి వచ్చింది. లీక్‌ల ప్రకారం,  వన్ ప్లస్ 11 5జి 6.7-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను పొందుతుంది. ఈ ఫోన్ సరికొత్త Android ప్రాసెసర్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 2, గరిష్టంగా 16 జి‌బి RAMతో 512 జి‌బి వరకు స్టోరేజ్ లభిస్తుంది. ఫోన్‌తో పాటు 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ప్రైమరీ కెమెరా సోనీ IMX890 సెన్సార్‌తో వస్తుంది. ఈ ఫోన్ 5,000 mAh బ్యాటరీ, 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios