Mobile Reviews: OnePlus 10 Pro vs OnePlus 9 pro ఈ రెండు ఫోన్‌లలో తేడా ఏంటి.. ఏది కొనడం బెస్ట్ ?

Mobile Reviews: తాజాగా వన్ ప్లస్ 10 ప్రొ విడుదలైన సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ కొత్త ఫోన్ గత సంవత్సరం ప్రారంభించిన OnePlus 9 ప్రోకి అప్‌గ్రేడ్ వెర్షన్. వన్ ప్లస్ 9ప్రొ ఈ ఏడాది జనవరిలో చైనాలో లాంచ్ అయ్యింది. 

OnePlus 10 Pro vs OnePlus 9 Pro: What will be new in  this phone, what is the advantage in buying?

కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వన్ ప్లస్ ఇండియాలో కొత్త ఫ్లాగ్‌షిప్ వన్ ప్లస్ 10ప్రొ (OnePlus 10) ప్రోని తాజాగా విడుదల చేసింది. ఈ ఫోన్  భారతదేశంలో లాంచ్ చేయనున్న కంపెనీ  అత్యంత ఖరీదైన ఫోన్. ఇంకా ఇందులో ఎన్నో మార్పులు చేసింది. అంతేకాదు అప్‌గ్రేడ్ చేయబడిన కెమెరాతో పరిచయం చేసారు. కొత్త ఫోన్ గత సంవత్సరం ప్రారంభించిన OnePlus 9 ప్రోకి అప్‌గ్రేడ్ వెర్షన్. వన్ ప్లస్ 9ప్రొ ఈ ఏడాది జనవరిలో చైనాలో లాంచ్ అయ్యింది. అయితే  వన్ ప్లస్9 ప్రొ అండ్ వన్ ప్లస్10 ప్రొకి మధ్య తేడా ఏమిటో తెలుసుకుందాం..

ధర
8జి‌బి ర్యామ్, 128జి‌బి స్టోరేజ్‌ వన్ ప్లస్ 10ప్రొ  వేరియంట్ ధర రూ.66,999. అంతేకాకుండా, ఈ స్మార్ట్‌ఫోన్ 12జి‌బి ర్యామ్, 256జి‌బి స్టోరేజ్ వేరియంట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది, దీని ధర రూ.71,999. ఈ స్మార్ట్‌ఫోన్ ఎమరాల్డ్ ఫారెస్ట్, వోల్కానిక్ బ్లాక్ అనే రెండు కలర్స్ లో అందుబాటులో ఉంటుంది. వన్ ప్లస్ 9ప్రొ ధర ఇటీవల తగ్గింది, దీంతో  ఫోన్ ప్రారంభ ధర రూ.44,999కి చేరింది.

స్పెసిఫికేషన్‌లు
వన్‌ప్లస్ 9 ప్రోలో ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11 ఉంది. అంతేకాకుండా 6.7-అంగుళాల క్వాడ్ హెచ్‌డి ప్లస్ డిస్‌ప్లే, 1440x3216 పిక్సెల్‌ల రిజల్యూషన్‌, డిస్ ప్లే నాణ్యత ఫ్లూయిడ్ డిస్ ప్లే 2.0 అమోలెడ్, రిఫ్రెష్ రేట్ 120Hz. డిస్ ప్లే రక్షణ కోసం 3D కార్నింగ్ గొరిల్లా గ్లాస్, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, 12జి‌బి వరకు LPDDR5 ర్యామ్, 256జి‌బి వరకు స్టోరేజ్ ఉంది.

ఆండ్రాయిడ్ 12 ఆధారిత ColorOS 12.1 వన్ ప్లస్ 10 ప్రొలో ఇచ్చారు. అంతేకాకుండా 1440x3216 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.7-అంగుళాల QHD + AMOLED డిస్‌ప్లే ఉంది. ఫోన్‌తో ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే కూడా ఉంది, డిస్‌ప్లే బ్రైట్‌నెస్ 1300 నిట్స్. డిస్ ప్లేలో గొరిల్లా గ్లాస్ విక్టస్ సపోర్ట్ చేయబడింది. ఫోన్ Snapdragon 8 Gen 1 ప్రాసెసర్, 12జి‌బి LPDDR5 ర్యామ్, 256జి‌బి వరకు స్టోరేజ్ ఉంది. కాబట్టి ప్రాసెసర్ అండ్ సాఫ్ట్‌వేర్ తప్ప వేరే మార్పు లేదు. రెండు ఫోన్‌లలో డిస్‌ప్లే కూడా ఒకేలా ఉంటుంది.

కెమెరా
వన్ ప్లస్ 10 ప్రొలో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీనిలో ప్రైమరీ లెన్స్ 48-మెగాపిక్సెల్ Sony IMX789 సెన్సార్, ఎపర్చరు f/1.8 ఉంది. దీనితో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)కి సపోర్ట్ కూడా ఉంది. రెండవ లెన్స్ 50-మెగాపిక్సెల్ Samsung ISOCELL JN1 సెన్సార్ అల్ట్రా వైడ్, మూడవ లెన్స్ OISకి సపోర్ట్ తో 8-మెగాపిక్సెల్ టెలిఫోటో, కెమెరాతో 8కే వీడియో రికార్డింగ్ చేయవచ్చు. ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.

వన్ ప్లస్ 9 ప్రోలో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, దీనిలో ప్రైమరీ లెన్స్ 48-మెగాపిక్సెల్ సోనీ IMX789 సెన్సార్, ఎపర్చరు f/1.8 ఉంది. లెన్స్‌తో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండూ అందుబాటులో ఉంటాయి. రెండవ లెన్స్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX766 సెన్సార్,  అల్ట్రా వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 8-మెగాపిక్సెల్ టెలిఫోటో, నాల్గవ లెన్స్ 2-మెగాపిక్సెల్ మోనోక్రోమ్. సెల్ఫీల కోసం, 16-మెగాపిక్సెల్ సెన్సార్‌, ఎపర్చరు f / 2.4 ఉంది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌ను కూడా పొందుతుంది.

కనెక్టివిటీ కోసం, వన్ ప్లస్ 10 ప్రొలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.2, GPS / A-GPS, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.  80W సూపర్ ఫ్లాష్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5000mAh బ్యాటరీని ఉంది. స్పీకర్‌తో డాల్బీ అట్మోస్‌కు కూడా సపోర్ట్ ఉంది. దీనితో, 50W AirVOOC వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సప్పోర్ట్ ఇచ్చారు.

వన్ ప్లస్ 9 ప్రొలో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ 5.2, GPS/ A-GPS, NFC, USB టైప్-సి పోర్ట్ ఉన్నాయి. ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ లభిస్తుంది. ర్యాప్ ఛార్జ్ 65T ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 4500mAh బ్యాటరీ ఉంది. ఫోన్‌లో డ్యూయల్ స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మోస్‌కు సపోర్ట్ ఉంది. ఫోన్ బరువు 183 గ్రాములు. ఈ ఫోన్ IP68 రేటింగ్ పొందింది. దీని బరువు 197 గ్రాములు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios