స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ డిజిటల్ ప్రత్యేక ఆఫర్లను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. బ్లాక్ బస్టర్ డిజిటల్ ఇండియా సేల్ పేరిట ఆఫర్లను ప్రకటించింది. ఈ పంద్రాగస్టు సందర్భంగా దేశంలోని అన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ లో ఎలక్ట్రానిక్ వస్తువులపై 15శాతం డిస్కౌంట్ ప్రకటించింది.

హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు నుంచి కొనుగోలు చేస్తే అదనంగా మరో 10శాతం డిస్కౌంట్, 5శాతం రిలయన్స్ డిజిటల్ క్యాష్ బ్యాక్ కూడా సొంతం చేసుకోవచ్చు. ఈ ఆఫర్ 360 రిలయన్స్ డిజిటల్ స్టోర్స్, 2200 మై జియో స్టోర్స్ లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రిలయన్స్ డిజిటల్ ఆన్ లైన్ అఫీషియల్ వెబ్ సైట్ ద్వారా కొనుగోలు చేసిన వారికి కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది.ఈ ఆఫర్లు ఆగస్టు 10వ తేదీ నుంచి ఆగస్టు 15వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. 

ఈ ఆఫర్ లో భాగంగా 55అంగుళాల టీవీ ప్రారంభ ధర రూ.39,999కే లభించనుంది. అదేవిధంగా 65అంగుళాల టీవీ రూ.59,990కి లభించనుంది. 32అంగుళాల స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ.10,999కే లభిస్తుంది. కేవలం టీవీలు మాత్రమే కాకుండా ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్లపై కూడా మంచి ఆఫర్లు ఉన్నాయి. సైడ్ బై సైడ్ రిఫ్రిజిరేటర్లు రూ.44,990కే లభిస్తున్నాయి. ఇక ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్లు.. రూ.16,990కే అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఒక వస్తువు కొనుగోలు చేస్తే మరో వస్తువు ఉచితంగా అందజేసే ఆఫర్లు కూడా ఉన్నాయి. 1.5టన్నుల త్రీ స్టార్ ఇన్వర్టర్ ఏసీ కొనుగోలు చేస్తే... వారికి రిలయన్స్ డిజిటల్ రూ.10,490విలువ చేసే ఎల్జీ కంపెనీకి చెందిన రిఫ్రిజిరేటర్ ని ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ల్యాప్ టాప్స్ పై కూడా బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. గేమింగ్ ల్యాప్ టాప్ రూ.55,999కే లభించనుంది. దీనిని కొనుగోలు చస్తే రూ.13వేలు విలువచేసే బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రతి ల్యాప్ టాప్ కొనుగోలుకీ గిఫ్ట్స్, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. ల్యాప్ టాప్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. స్పెషల్లీ ఉచితంగా షాపింగ్ ఓచర్స్ కూడా ఇస్తున్నారు.

ఇక స్మార్ట్ ఫోన్ల విషయానికి వస్తే... మెజో జీ6 ప్లస్(6జీబీ) స్మార్ట్ ఫోన్ కేవలం రూ.9.999కే అందిస్తోంది. న్యూ ఒప్పోఆర్17(8జీబీ) రూ.19,999కి అందిస్తోంది. జీరో డౌన్ పేమెంట్, ఈఎంఐ సదుపాయాన్ని కూడా కల్పిస్తున్నట్లు రిలయన్స్ డిజిటల్ ప్రకటించింది.