Asianet News TeluguAsianet News Telugu

నోకియా పైసా వసూల్ బడ్జెట్ ఫోన్.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే ఎన్ని రోజులు వస్తుందో తెలుసా..?

నోకియా సి31ని చార్‌కోల్, మింట్ అండ్ సియాన్ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు. 3 జీబీ ర్యామ్‌తో కూడిన 32 జీబీ స్టోరేజ్ ధర రూ.9,999, 4 జీబీ ర్యామ్‌తో కూడిన 64 జీబీ స్టోరేజ్ ధర రూ.10,999గా ఉంది. 

Nokia launches cheap smartphone in India, will get three days battery life with triple camera
Author
First Published Dec 15, 2022, 6:51 PM IST

హెచ్‌ఎం‌డి గ్లోబల్ యాజమాన్యంలోని నోకియా  బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ నోకియా సి31 ను ఇండియాలో విడుదల చేసింది. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.9,999. ఈ ఫోన్ తో 6.7-అంగుళాల హెచ్‌డి డిస్ ప్లే, మూడు రోజుల బ్యాటరీ లైఫ్ లభిస్తుంది. నోకియా C31 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఇచ్చారు. ఫోన్‌లో అండ్రాయిడ్ 12తో గరిష్టంగా 128జి‌బి స్టోరేజ్ అందించారు. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం...

నోకియా సి31 ధర 
నోకియా సి31ని చార్‌కోల్, మింట్ అండ్ సియాన్ కలర్ ఆప్షన్‌లలో పరిచయం చేసారు. 3 జీబీ ర్యామ్‌తో కూడిన 32 జీబీ స్టోరేజ్ ధర రూ.9,999, 4 జీబీ ర్యామ్‌తో కూడిన 64 జీబీ స్టోరేజ్ ధర రూ.10,999గా ఉంది. నోకియా ఇండియా వెబ్‌సైట్ నుండి ఫోన్ కొనుగోలు చేయవచ్చు. అయితే, ఇప్పటి వరకు ఫోన్‌ సేల్స్  గురించి కంపెనీ ఎలాంటి  సమాచారం ఇవ్వలేదు. 

నోకియా  సి31 స్పెసిఫికేషన్లు
నోకియా  సి31 1600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియోతో 6.74-అంగుళాల హెచ్‌డి ప్లస్ ఎల్‌సి‌డి డిస్‌ప్లే  ఉంది. డిస్ ప్లేతో 2.5 కర్వ్డ్ గ్లాస్ ప్రొటెక్షన్  ఇచ్చారు. ఆక్టాకోర్ యూనిసోక్ ప్రాసెసర్‌తో కూడిన ఈ ఫోన్‌లో 64జి‌బి వరకు స్టోరేజ్ అండ్ 4జి‌బి వరకు ర్యామ్ ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది. ఫోన్‌లో సెక్యూరిటి కోసం ఫింగర్‌ప్రింట్ సెన్సార్ సపోర్ట్ కూడా ఉంది. 

నోకియా  సి31 కెమెరా అండ్ బ్యాటరీ లైఫ్ 
ఫోన్ కెమెరా సపోర్ట్ గురించి మాట్లాడితే  ట్రిపుల్ రియర్ కెమెరా అందించారు. ఫోన్‌లోని ప్రైమరీ కెమెరా 13 మెగాపిక్సెల్స్, సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్స్ మాక్రో సెన్సార్, మూడవది 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. సెల్ఫీ కోసం ఫోన్‌లో 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ సెన్సార్ కెమెరా ఉంది. ఫోన్ లో 5050 mAh బ్యాటరీ ఉంది, 10W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బ్యాటరీకి సంబంధించి, ఫోన్‌ను ఫుల్ ఛార్జ్‌తో మూడు రోజుల పాటు రన్ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. 

Follow Us:
Download App:
  • android
  • ios