Asianet News TeluguAsianet News Telugu

చైనీస్ స్మార్ట్‌ఫోన్స్ పై బ్యాన్: 12 వేల కంటే తక్కువ ధర చైనా ఫోన్‌లపై కీలక ప్రభుత్వం ప్రకటన..

 తాజాగా భారతదేశంలో రూ. 12,000 కంటే తక్కువ ధర ఉన్న చైనీస్ ఫోన్‌లపై నిషేధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. లావా, మైక్రోమ్యాక్స్ వంటి దేశీయ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది.

No Plan To Ban Chinese Phones Cheaper Than rs 12000: central Minister rajeev chandrashekhar
Author
First Published Aug 30, 2022, 11:36 AM IST

భారతదేశంలో రూ. 12,000 కంటే తక్కువ ధర ఉన్న చైనా కంపెనీల ఫోన్‌లపై నిషేధానికి సంబంధించి ప్రభుత్వం నుండి ఒక ప్రకటన వచ్చింది. ఈ ఫోన్ల నిషేధంపై ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఖండించారు. చైనా కంపెనీ ఫోన్లపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రణాళిక రూపొందించలేదని తెలిపారు. భారతీయ బ్రాండ్‌ను ప్రోత్సహించడం ప్రభుత్వ బాధ్యత ఇంకా కర్తవ్యం. అన్యాయమైన వాణిజ్య పద్ధతుల కారణంగా భారతీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌ను బహిష్కరిస్తే మేము జోక్యం చేసుకుని పరిష్కరిస్తాము. 

నిజానికి తాజాగా భారతదేశంలో రూ. 12,000 కంటే తక్కువ ధర ఉన్న చైనీస్ ఫోన్‌లపై నిషేధం ఉన్నట్లు వార్తలు వచ్చాయి. లావా, మైక్రోమ్యాక్స్ వంటి దేశీయ కంపెనీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ వాదనను కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తోసిపుచ్చారు. 

భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను చైనా కంపెనీలు ఆక్రమించాయి
ప్రస్తుతం భారతదేశం ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్, అయితే దీనిని చైనా కంపెనీలు ఆక్రమించాయి. ఈ చైనా కంపెనీల ముందు దేశీయ కంపెనీలు నిలదొక్కుకోలేకపోతున్నాయి. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్ పాయింట్ ప్రకారం, భారతదేశంలో రూ. 12,000 లోపు విక్రయించే ఫోన్‌లలో 80 శాతం చైనా కంపెనీలవే.

అంటే, భారతదేశంలో  మిడ్-సెగ్మెంట్ అండ్ బడ్జెట్-సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా కంపెనీల స్మార్ట్‌ఫోన్‌లు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కౌంటర్‌పాయింట్ ప్రకారం, జూన్ 2022 వరకు త్రైమాసికంలో భారతదేశం  అమ్మకాలలో $150 లోపు అంటే 12 వేల లోపు  స్మార్ట్‌ఫోన్‌లు మూడవ వంతు వాటా ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios