Asianet News TeluguAsianet News Telugu

4జి, 5జి నెట్‌వర్క్ సపోర్ట్‌తో మోటోరోల బడ్జెట్ ఫోన్.. లాంచ్‌కు ముందే ఫీచర్స్ లీక్..

లీక్‌ల ప్రకారం, మోటో జి13 వెనుక భాగంలో ఫ్లాట్ డిజైన్‌తో కెమెరా సెటప్ ఉంటుంది. ఫోన్ కెమెరా సెటప్ వివో  T1 ప్రో అండ్ వివో T1 44W స్మార్ట్‌ఫోన్‌ల లాగానే కనిపిస్తుంది. అంటే, ఫోన్‌తో కెమెరా మాడ్యూల్‌లో రెండు గుండ్రటి రింగ్‌లు కనిపిస్తాయి. 

Moto G13 Specifications of Motorola G13  affordable phone revealed before launch
Author
First Published Dec 26, 2022, 5:48 PM IST

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోల త్వరలో  జి సిరీస్‌ను విస్తరిస్తూ త్వరలోనే మోటో జి13ని లాంచ్ చేయనుంది. మోటో జి13 లాంచ్ కాకముందే ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల గురించి సమాచారం లీక్ అయ్యింది. లీక్స్ ప్రకారం ఈ ఫోన్‌ను 4G అండ్ 5G నెట్‌వర్క్ సపోర్ట్‌తో అందించవచ్చు. అలాగే  ఫోన్‌తో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్‌ను 2023 మొదటి త్రైమాసికంలో పరిచయం చేయవచ్చు. కంపెనీ తాజాగా భారతదేశంలో మోటో  E22ను కూడా ప్రవేశపెట్టింది. 

మోటో జి13 స్పెసిఫికేషన్లు
లీక్‌ల ప్రకారం, మోటో జి13 వెనుక భాగంలో ఫ్లాట్ డిజైన్‌తో కెమెరా సెటప్ ఉంటుంది. ఫోన్ కెమెరా సెటప్ Vivo T1 ప్రో అండ్ Vivo T1 44W స్మార్ట్‌ఫోన్‌ల లాగానే కనిపిస్తుంది. అంటే, ఫోన్‌తో కెమెరా మాడ్యూల్‌లో రెండు గుండ్రటి రింగ్‌లు కనిపిస్తాయి. 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ సెకండరీ డెప్త్ సెన్సార్‌ ఫోన్‌తో చూడవచ్చు. ఫోన్ ఇతర ఫీచర్లు అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడితే 4జి‌బి ర్యామ్ తో 64జి‌బి స్టోరేజ్, 6 జి‌బి ర్యామ్ తో 128జి‌బి స్టోరేజ్ లభిస్తుంది. 5,000 mAh బ్యాటరీ, 10 వాట్ల ఛార్జింగ్ సపోర్ట్‌ పొందుతుంది. USB టైప్-C పోర్ట్ ఛార్జింగ్ కోసం ఉంటుంది. 

మోటో జి13తో పంచ్-హోల్ డిస్‌ప్లే ఇచ్చారు. మీడియా టెక్ హీలియో G99, Android 13 MyUX 4.0 ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్‌తో వస్తుంది. ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా చూడవచ్చు. ఫోన్ సెక్యూరిటి కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌, ఇతర కనెక్టివిటీ కోసం 3.5mm ఆడియో జాక్‌ ఉంది. 

మోటో E22sని కూడా రూ. 8,999 ధరకు లాంచ్ చేసారు. ఈ ధర వద్ద 4జి‌బి ర్యామ్ తో 64 జి‌బి స్టోరేజ్ లభిస్తుంది. పంచ్-హోల్ డిజైన్ అండ్ 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5-అంగుళాల HD+ ఐ‌పి‌ఎస్ ఎల్‌సి‌డి డిస్‌ప్లే ఉంది.  MediaTek హీలియో G37 ప్రాసెసర్ ఇచ్చారు.

ఫోన్ సెక్యూరిటి కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ కూడా ఉంది. Moto E22Sలో డ్యూయల్ కెమెరా సెటప్‌  అందించారు, దీనిలో 16-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2-మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఎల్‌ఈ‌డి ఫ్లాష్ వెనుక కెమెరాతో ఇచ్చారు.  

Follow Us:
Download App:
  • android
  • ios