Asianet News TeluguAsianet News Telugu

బడ్జెట్‌లోనే షియోమీ 5 కెమెరాల ఫోన్

చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమీ విపణిలోకి మరో స్మార్ట్​ఫోన్​ తీసుకురానున్నది. వెనుక వైపు 5 కెమెరాలతో రూపొందించిన ఎంఐ సీసీ9 ప్రోను వచ్చేనెల ఐదో తేదీన 5న విడుదల చేయనుంది. భారత్​ విపణిలోకి ఈ ఫోన్‌ను ఎంఐ ఏ3 ప్రో పేరుతో రానున్నట్లు సమాచారం.

Mi CC9 Pro launch date officially confirmed, will come with 108MP camera
Author
Hyderabad, First Published Oct 29, 2019, 11:19 AM IST

న్యూఢిల్లీ: బడ్జెట్​ ధరల్లో స్మార్ట్​ఫోన్లు అందించే చైనా దిగ్గజం షియోమీ నుంచి మరో కొత్త మొబైల్​ రానున్నది. 5 బ్యాకప్ కెమెరాలతో రూపొందించిన ఎంఐ సీసీ9 ప్రో స్మార్ట్​ఫోన్​ను వచ్చేనెల ఐదో తేదీన విపణిలోకి విడుదల చేసేందుకు షియోమీ సిద్ధమైంది. ఈ ఫోన్‌కు సంబంధించి పూర్తి ఫీచర్లను షియోమీ వెల్లడించలేదు గానీ  మీటూ సంస్థ భాగస్వామ్యంలో వచ్చిన సీసీ స్మార్ట్​ఫోన్ల సిరీస్​లో సీసీ9 ప్రో మూడోది. ఇప్పటివరకు ఈ సిరీస్​లో సీసీ9, సీసీ9ఈ ఫోన్లను విడుదల చేసింది షియోమీ.

భారత్​లో ఏ3 ప్రో సీసీ9ఈను ప్రపంచ మార్కెట్లో ఎంఐ ఏ3 ఆండ్రాయిడ్​ వన్​ పేరుతో విడుదల చేసింది. సీసీ9 ప్రోను ఏ3 ప్రోగా విడుదల చేయనున్నట్లు సమాచారం. 6 జీబీ ర్యామ్​ విత్ 128 జీబీ రామ్​, 8 జీబీ ర్యామ్ విత్128జీబీ రామ్​, 8జీబీ ర్యామ్​ విత్ 256 జీబీ రామ్ వేరియంట్లలో ఈ ఫోన్ లభించనుంది.

also read  ఇక వార్ జియో x ఎయిర్‌టెల్ మధ్యే...

అధికారికంగా వెల్లడించిన సమాచారం ప్రకారం.. సీసీ9 ప్రోలో కెమెరాపై ప్రధానంగా దృష్టి సారించింది షియోమీ. వెనుకవైపు 5 కెమెరాలను పొందుపరిచింది. ప్రధాన కెమెరాలో శామ్‌సంగ్ రూపొందించిన 108 మెగాపిక్సల్​ సెన్సార్​ను అమర్చింది. 

Mi CC9 Pro launch date officially confirmed, will come with 108MP camera

ఫొటో బ్యాక్​గ్రౌండ్​ స్పష్టత కోసం 12 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, 8ఎంపీ టెలిఫొటో లెన్స్​, మాక్రో లెన్స్, డెప్త్ సెన్సార్లనూ పొందుపరిచింది.ఒప్పో రెనో ఫోన్ల తరహాలో 5 రెట్లు ఆప్టికల్​ జూమ్​ ఆప్షన్​ కూడా ఇచ్చింది షియోమీ. మార్కెట్లో ప్రస్తుతానికి 5 కెమెరాలున్న స్మార్ట్​ ఫోన్​ నోకియా 9 ప్యూర్​వ్యూ మాత్రమే.

also read ఫేస్ బుక్ స్పెషల్ ఫీచర్.. ప్రపంచమంతా అక్కడే

ఎంఐ సీసీ 9 ప్రో మోడల్ స్మార్ట్ పోన్ 6.4 అంగుళాల ఫుల్​ హెచ్​డీ తోపాటు అమోలెడ్ డిస్ ప్లే కలిగి ఉంటుంది. క్వాల్​కమ్​ స్నాప్​డ్రాగన్​ 730జీ చిప్​సెట్​ గల ఈ ఫోన్ వెనుక 108ఎంపీ సామర్థ్యం గల కెమెరా ఉంటుంది. అలాగే 32 ఎంపీ సెల్ఫీ కెమెరా కూడా అమర్చారు. ఈ ఫోన్ 4000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ ఉంటుంది. ఇప్పటికి సంస్థ ఫోన్ ధర ఎంతో ప్రకటించలేదు కానీ.. భారత విపణిలో రూ.16 వేల నుంచి రూ.20 వేల మధ్య ఉండొచ్చని అంచనా. 

Follow Us:
Download App:
  • android
  • ios