Asianet News TeluguAsianet News Telugu

ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియంతో లెనోవా పవర్ ఫుల్ ప్రాసెసర్ ఫోన్.. ధర, ఫీచర్లు వావ్..

లెనోవా థింక్‌ప్యాడ్ లాప్‌టాప్ లాగా దీనిని మోటరోలా రూపొందించిందని దాని పేరును బట్టి తెలిసింది. ఫోన్ ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేయబడింది ఇంకా దాని ముందు భాగంలో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంది. 

Lenovo introduced ThinkPhone, equipped with powerful processor and 144Hz display, know the price and features
Author
First Published Jan 6, 2023, 10:13 PM IST

లెనోవో యాజమాన్యంలోని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటరోల బిజినెస్-గ్రేడ్ స్మార్ట్‌ఫోన్ థింక్‌ఫోన్‌ను కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2023)లో ఆవిష్కరించింది. లెనోవా థింక్‌ప్యాడ్ లాప్‌టాప్ లాగా దీనిని మోటరోలా రూపొందించిందని దాని పేరును బట్టి తెలిసింది. ఫోన్ ఎయిర్‌క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియంతో తయారు చేయబడింది ఇంకా దాని ముందు భాగంలో గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంది. థింక్‌ఫోన్ "బిజినెస్-గ్రేడ్" స్మార్ట్‌ఫోన్‌గా మార్కెట్ చేయబడుతోంది. స్నాప్ డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్, 144Hz రిఫ్రెష్ రేట్ ఉంది. ఫోన్ ఇతర స్పెసిఫికేషన్లు అండ్ ఫీచర్ల గురించి తెలుసుకుందాం...

లెనోవా థింక్‌ ఫోన్  ధర 
లెనోవా థింక్‌ఫోన్ ధరను ప్రస్తుతం ఇంకా ప్రకటించలేదు. దీనిని రాబోయే నెలల్లో US, యూరప్, అమెరికా, ఆస్ట్రేలియా ఇంకా ఆసియాలోని సెలెక్ట్ చేసిన దేశాలలో ప్రారంభించవచ్చు. అంతేకాదు ఫోన్ లాంచ్ సమయంలో కంపెనీ ఇతర వివరాలను కూడా వెల్లడించవచ్చు. 

 స్పెసిఫికేషన్‌లు 
కొత్త లెనోవో థింక్‌ఫోన్‌లో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లే సెంట్రల్ అలైనేడ్ హోల్ పంచ్ కటౌట్‌తో ఉంటుంది. డిస్ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ ఉంది ఇంకా 1.25 మీటర్ల నుండి డ్రాప్ రెసిస్టెంట్‌గా క్లెయిమ్ చేయబడింది. స్మార్ట్‌ఫోన్‌లో అరామిడ్ ఫైబర్ బ్యాక్ ప్యానెల్ ఇంకా ఎయిర్‌క్రాఫ్ట్-గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్ ఉన్నాయి. ఈ ఫోన్ MIL-STD 810H సర్టిఫికేట్ పొందింది.

లెనోవా థింక్‌ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్‌, 12 జి‌బి RAMతో 512 జి‌బి వరకు స్టోరేజ్,  మైక్రోసాఫ్ట్ 365, ఔట్ లుక్, Teams మొబైల్ యాప్‌లు ప్రీలోడెడ్‌తో అందిస్తుంది. మోటరోల థింక్ షీల్డ్  ప్రొటెక్షన్ ఫోన్‌లో ఉంది, ఇది ఫోన్‌ను మాల్వేర్, ఫిషింగ్, నెట్‌వర్క్ దాడుల నుండి సురక్షితంగా ఉంచుతుంది. 

కెమెరా అండ్ బ్యాటరీ
లెనోవా థింక్‌ఫోన్ కెమెరా సెటప్ గురించి మాట్లాడితే f/1.8 అపర్చర్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా సెన్సార్ ఉంది. ఫోన్‌లో మైక్రో విజన్‌తో కూడిన 13-మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంది. సెల్ఫీలు ఇంకా వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ సెన్సార్‌  ఉంది. 5000mAh బ్యాటరీ, 68W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఫోన్ ఉన్న బాక్స్‌లో ఛార్జర్ కూడా ఉంటుంది.

Follow Us:
Download App:
  • android
  • ios