వావ్.. ఇన్-బిల్ట్ స్పీకర్‌తో స్మార్ట్ గ్లాసెస్.. దీనిని కంప్యూటర్‌కు, మొబైల్ కి కూడా కనెక్ట్ చేయవచ్చు..
లెనోవా గ్లాసెస్ T1 ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్‌లతో కూడా ఉపయోగించవచ్చు. దీన్ని కంప్యూటర్‌కు కూడా కనెక్ట్ చేయవచ్చు. ఛార్జింగ్ కోసం యూఎస్‌బి టైప్-సి పోర్ట్, బాక్స్‌లో కేబుల్ కూడా లభిస్తుంది.
లెనోవో కొత్త స్మార్ట్ గాగుల్స్ లెనోవా గ్లాసెస్ T1 పేరుతో లాంచ్ చేసింది. లెనోవో గ్లాసెస్ T1కి 1080x1920 పిక్సెల్ రిజల్యూషన్‌తో రెండు మైక్రో OLED డిస్‌ప్లేలు ఉంటాయి. ఈ రెండు గ్లాసెస్ రిఫ్రెష్ రేట్ 60Hz.లెనోవో గ్లాసెస్ T1 డిస్‌ప్లేలో కంటెంట్ ప్లే కోసం ఇంటర్నల్ స్పీకర్ ఇచ్చారు. డిస్ ప్లే కాంట్రాస్ట్ 10,000:1. యాంటీ-ఫ్లిక్కర్ ఇంకా లో బ్లూ లైట్ కోసం TUV రైన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ పొందింది.
ధర
లెనోవా గ్లాసెస్ T1ని చైనాలో Lenovo యోగా గ్లాస్‌గా పరిచయం చేసారు. వీటి సేల్స్ ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఇతర మార్కెట్లలో సేల్స్ 2023 నాటికి ప్రారంభమవుతుంది. అయితే భారత మార్కెట్లో ఈ స్మార్ట్ గ్లాసెస్ లాంచ్ అయ్యే వార్తలు లేవు.
స్పెసిఫికేషన్లు
లెనోవా గ్లాసెస్ T1 రెండు మైక్రో OLED డిస్ ప్లేలను ఉపయోగిస్తుంది. డిస్ ప్లే రిఫ్రెష్ రేట్ 60Hz. గ్లాసెస్‌తో హై రెసిస్టెంట్ కీలు ఇచ్చారు. అంతేకాకుండా నోస్ ప్యాడ్, అడ్జస్ట్ చేయగల టెంపుల్ ఆర్మ్ ఉన్నాయి. ఈ గాగుల్స్‌తో బ్లూ లైట్ ఫిల్టర్ కూడా ఉంటుంది.
మోటోరోల ఫోన్‌లకు కనెక్ట్ చేయడానికి రెడీ ఫర్ అనే ఫీచర్ కూడా ఇందులో ఉంది. లెనోవా గ్లాసెస్ T1ని అండ్రాయిడ్, iOS ఫోన్‌లలో కూడా ఉపయోగించవచ్చు. దీన్ని కంప్యూటర్‌కు కూడా కనెక్ట్ చేయవచ్చు. ఛార్జింగ్ కోసం USB టైప్-సి పోర్ట్, బాక్స్‌లో కేబుల్ కూడా లభిస్తుంది.