Asianet News TeluguAsianet News Telugu

కేవలం రూ.6 చాలు.. 84 రోజుల వ్యాలిడిటీ.. జియో సూపర్ రీఛార్జ్ ప్లాన్..

ఇంతకుముందు ఈ ప్లాన్  ధర రూ. 395గా ఉండేది. కానీ రీఛార్జ్ ప్లాన్ రేట్స్  పెంచిన తర్వాత ఈ ప్లాన్ ధర రూ. 479కి మారింది. మీరు కూడా జియో ప్రీపెయిడ్ కస్టమర్ అయితే 3 నెలల ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే రూ. 479 ప్లాన్ మీకు బెస్ట్.

Just 6 rupees is enough.. 84 days validity.. Reliance Jio's affordable recharge plan-sak
Author
First Published Jul 30, 2024, 6:56 PM IST | Last Updated Jul 30, 2024, 6:56 PM IST

దేశీయ టెలికాం రిలయన్స్ జియో 84 రోజుల వాలిడిటీతో  చాలా ప్లాన్‌లను అందిస్తోంది. మీరు కూడా జియో యూజర్లయితే  లాంగ్ వాలిడిటీ ప్లాన్‌ల కోసం చూస్తున్నట్లయితే ఈ ప్లాన్స్  మీకు చాలా ఉపయోగపడతాయి. వీటిలో జియో రూ.479 ప్లాన్‌ 84 రోజులు అంటే సుమారు 3 నెలల వాలిడిటీ అందిస్తోంది.

ఇంతకుముందు ఈ ప్లాన్  ధర రూ. 395గా ఉండేది. కానీ రీఛార్జ్ ప్లాన్ రేట్స్  పెంచిన తర్వాత ఈ ప్లాన్ ధర రూ. 479కి మారింది. మీరు కూడా జియో ప్రీపెయిడ్ కస్టమర్ అయితే 3 నెలల ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే రూ. 479 ప్లాన్ మీకు బెస్ట్. ఈ ప్లాన్ కోసం మీకు రోజుకు దాదాపు రూ.6 ఖర్చు అవుతుందనమాట. 

జియో రూ. 479 ప్లాన్‌తో కస్టమర్‌లు 84 రోజుల వాలిడిటీని పొందుతారు. రిలయన్స్ జియో రూ. 479 ప్లాన్ లాంగ్  వాలిడిటీ ప్లాన్ కోసం చూస్తున్న కస్టమర్ల కోసం తీసుకొచ్చారు. అయితే కస్టమర్లు ఈ ప్లాన్ ద్వారా మొత్తం 6GB డేటాను పొందుతారు.

అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్  కాల్స్, 1,000 SMSలు ఫ్రీగా లభిస్తాయి. మీ డేటా ప్లాన్ లిమిట్ ముగిసిన  తర్వాత స్పీడ్  64Kbpsకి పడిపోతుంది. ఈ రూ. 479 జియో ప్లాన్‌తో  ఇంటర్నెట్ డేటా, కాల్స్, SMS కాకుండా ఇతర బెనిఫిట్స్ కూడా  ఉన్నాయి.

అవేంటంటే జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్‌కు ఆక్సెస్‌ను అందిస్తుంది. మీకు 5జి ఫోన్ ఇంకా మీ ప్రాంతంలో 5G నెట్ వర్క్ ఉంటే మీరు ఈ ప్లాన్‌తో 5G సర్వీస్ కూడా పొందుతారు.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios