Google Gemini Pro Free Access : రిలయన్స్ జియో వినియోగదారులు బంపరాఫర్. ఇకపై రూ.35 వేలకు పైగా విలువైన గూగుల్ జెమిని ప్రో ను ఉచితంగా పొందవచ్చు. ఎలాగో ఇక్కడ తెలుసుకొండి
Gemini Pro Free Access : రిలయన్స్ జియో వినియోగదారులకు గుడ్ న్యూస్. గూగుల్ AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అసిస్టెంట్ జెమిని ప్రో ను తమ వినియోగదారులకు ఉచితంగా అందించనున్నట్లు రియలన్స్ జియో ప్రకటించింది. ఇవాళ్టి(30 అక్టోబర్ 2025) నుండే ఈ ఉచిత సేవలు అందుబాటులోకి వస్తాయని జియో తెలిపింది.
జెమిని ప్రో సేవలు ఉచితంగా పొందేందుకు ఎవరు అర్హులు :
రిలయన్స్ జియో భారతీయ యువతకు ఈ గూగుల్ జెమిని ప్రో సేవలను ఉచితంగా అందిస్తోంది. అంటే 18 నుండి 25 ఏళ్లలోపు వారికే ఈ జెమిని ప్రో ఏఐ సేవలు ఉచితం. అంతేకాదు అన్ లిమిటెడ్ 5G ప్లాన్ కలిగినవారే ఈ 35,100 రూపాయల విలువైన జెమిని ప్రో సేవలను ఉచితంగా వాడుకునేందుకు అర్హులు.
ఏఏ సేవలు ఉచితం :
జియో అందించే ఈ ఆఫర్ ద్వారా జెమిని ప్రో అన్ లిమిటెడ్ చాట్ సేవలు పొందవచ్చు. అలాగే 2TB క్లౌడ్ స్టోరేజ్, వీడియోల కోసం Veo 3.1, నానో బనానా ద్వారా ఇమేజ్ జనరేషన్ సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇలా గూగుల్ జెమిని ప్రో సబ్క్రిప్షన్ ద్వారా పొందే సేవలను 25 ఏళ్లలోపు యువతీయువకులు ఉచితంగా పొందవచ్చు.
ఎందుకు జియో ఈ ఆఫర్ ప్రకటించింది :
దేశ నిర్మాణంలో నేటితరం యువతదే కీలకపాత్ర.. ఇందుకోసం వారికి టెక్నాలజీ అందుబాటులో ఉంచడం చాలా ముఖ్యం. అందుకే దేశంలోనే 18-25 ఏళ్లలోపు యువతీయువకులకు గూగుల్ జెమిని ప్రో సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయించినట్లు రిలయన్స్ చెబుతోంది.
రూ.349 ప్లాన్ ద్వారా అన్ లిమిటెడ్ 5G పొందవచ్చు. ఇలా హై స్పీడ్ 5G ని జెమిని ప్రో తో అనుసంధానించి వినియోగదారులు సరికొత్త అనుభూతిని ఇవ్వనున్నట్లు జియో చెబుతోంది.
ఈ ఆఫర్ ద్వారా జియో వినియోగదారులు పూర్తిగా 18 నెలలు ఉచితంగానే గూగుల్ జెమిని సేవలు పొందవచ్చు. యంగ్ ఇండియా దిశగా యువతలో క్రియేటివిటీ, ఇన్నోవేషన్ ను పెంపొందించడమే ఈ ఆఫర్ వెనకున్న ముఖ్య ఉద్దేశమని జియో అంటోంది.
గూగుల్ జెమిని ప్రో ఉచిత సేవలు ఎలా పొందాలి?
మై జియో యాప్ ద్వారా చాలా సింపుల్ గా ఈ ఆఫర్ ను యాక్టివేట్ చేసుకోవచ్చని రిలయన్స్ జియో చెబుతోంది. ఒక్కసారి యాక్టివేట్ చేసుకుంటే 18 నెలలపాటు ఉచితంగా గూగుల్ జెమిని ప్రో ఏఐ వాడుకోవచ్చు. అయితే జియో అన్ లిమిటెడ్ 5G ప్లాన్ ప్లాన్ అందుబాటులో ఉండాలి.
ఈ ఆఫర్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం jio.com ను చూడండి.
