Asianet News TeluguAsianet News Telugu

జియో మరో బంపర్ ఆఫర్..నెలకు 1100 జీబీ డేటా ఫ్రీ

ప్రివ్యూ ఆఫర్ కింద 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు గరిష్టంగా 100 జీబీ వరకు డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు సమాచారం. 

Jio GigaFiber Preview Offer to Give 100GB Data at 100 Mbps Speeds
Author
Hyderabad, First Published Aug 18, 2018, 4:42 PM IST

ప్రముఖ టెలికాం సంస్థ జియో.. తన కష్టమర్లకు మరో బంపర్ ఆఫర్ తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే జియో.. తన గిగాఫైబర్ సేవలకు గాను రిజిస్ట్రేషన్లను ఇటీవలే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే చాలా మంది జియో గిగాఫైబర్ సేవలకు గాను రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఇంకా అవి కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అధిక సంఖ్యలో రిజిస్ట్రేషన్లు వచ్చిన మెట్రో సిటీల్లో ముందుగా జియో గిగాఫైబర్ సేవలను ప్రారంభిస్తారు.

అయితే గిగాఫైబర్ సేవలు ప్రారంభం అయ్యేందుకు మరికొద్ది నెలలు పట్టే అవకాశం ఉండగా, సేవలను ప్రారంభించాక 3 నెలల పాటు జియో తన గిగాఫైబర్ కస్టమర్లకు ఉచితంగా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందించనున్నట్లు తెలిసింది. 3 నెలల కాలవ్యవధికి గాను ప్రివ్యూ ఆఫర్ కింద 100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో నెలకు గరిష్టంగా 100 జీబీ వరకు డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు సమాచారం. 

ఇక 100 జీబీ కోటా అయిపోయినా ఒక్కోటి 40 జీబీ విలువ గల 25 టాపప్‌లను కూడా నెలలలో ఉచితంగా వేసుకునేలా జియో తన గిగాఫైబర్ సేవల ప్రివ్యూ ఆఫర్‌లో సౌకర్యాన్ని అందివ్వనున్నట్లు తెలిసింది. అదే జరిగితే వినియోగదారులకు ఒక నెలకు 1100 జీబీ డేటా ఉచితంగా వస్తుంది. అలా 3 నెలల పాటు నెలకు 1.1 టీబీ డేటాను వాడుకోవచ్చు.

అయితే.. జియో.. ఈ ఆఫర్ ప్రకటిస్తుందనేది ప్రస్తుతానికి ప్రచారం మాత్రమే. నిజంగా ప్రకటిస్తుందో లేదో తెలియాలంటే... మరికొద్ది రోజుల వరకు ఆగాల్సి ఉంటుంది. 

Follow Us:
Download App:
  • android
  • ios