భారత దేశంలో జియో చేసిన మాయ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్ ని వాడగలుగుతున్నారూ అంటే అది కేవలం జియో వల్లనే. జియో టెలికాం రంగంలోకి అడుగుపెట్టగానే... ఇతర టెలికాం ఆపరేటర్లు కూడా దిగివచ్చాయి. ఈ సంగతి పక్కన పెడితే... తెలంగాణ వాసులకు జియో సేవలు మరింత అందుబాటులోకి రానున్నాయి. తెలంగాణ లో 10,000 ట‌వ‌ర్ల కీల‌క మైలురాయిని జియో చేరుకుంది. దీంతో నెట్వర్క్ పరంగా మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని చాటుకుంది.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జియో వినియోగ‌దారులు సైతం జియో యొక్క డిజిట‌ల్ లైఫ్ సేవ‌ల‌ను వేగంగా అందిపుచ్చుకున్నారు. కోటి మందికి పైగా చందాదారులు ప్ర‌స్తుతం రాష్ట్రవ్యాప్తంగా డిజిట‌ల్ సేవ‌ల‌ను పొందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్ర‌తి నెల జియో ప్ర‌తి జిల్లా నుంచి అనేక మంది చందాదారుల‌ను త‌న ఖాతాలో జ‌మ‌చేసుకుంటూ ముందుకు సాగుతోంది.

 డాటా యొక్క శ‌క్తి ద్వారా ప్ర‌తి భార‌తీయుడిని శ‌క్తివంతుడిని చేయాల‌ని మ‌రియు వారు అనేక అద్భుతాల‌ను చేసే అవ‌కాశం క‌ల్పించాల‌నే ల‌క్ష్యంతో 35 నెల‌ల క్రితం జియో సేవ‌లు ప్రారంభం అయ్యాయి. భార‌త‌దేశానికి చెందిన డిజిట‌ల్ ముఖ‌చిత్రాన్ని స‌మూలంగా మార్చివేయడంలో జియో అత్యంత కీల‌క‌మైన పాత్ర పోషించింది.

 జియో అరంగేట్రం ద్వారా ప్ర‌పంచంలోనే అతి ఎక్కువ మొబైల్ డాటా వినియోగదారుల్లో భార‌త‌దేశం నంబ‌ర్ వ‌న్ స్థానంలో నిలిచింది. భార‌త‌దేశంలో ఉచిత వాయిస్ కాల్ సేవ‌ల క‌ల‌ను జియో నిజం చేసింది. డాటా వైపు ఈ మార్కెట్ వేగంగా సాగింది మ‌రియు ఈ డిజిట‌ల్ విప్ల‌వంలో వినియోగ‌దారులు విజేత‌గా నిలిచారు. 

ప్ర‌పంచంలోనే అతిపెద్ద డాటా నెట్‌వ‌ర్క్ కంపెనీగా జియో నిలిచింది. భార‌త‌దేశంలోనూ ఈ స్థానాన్ని స‌హ‌జంగానే కైవ‌సం చేసుకుంది. జూన్ 2019 ట్రాయ్ గ‌ణాంకాల ప్ర‌కారం, దేశవ్యాప్తంగా 33.12 కోట్ల మంది చందాదారుల‌ను జియో క‌లిగి ఉంది. కాగా ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్ లో  (ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలు కలిపి) జియో వినియోగదారుల సంఖ్య 2 .64 కోట్లకు చేరుకుంది. ఈ రెండు రాష్ట్రాల్లో జియో 20000 కు పైగా టవర్ల ను ఇప్పటికే ఏర్పాటు చేసి సేవలు అందిస్తోంది.

 జియో నెట్‌వ‌ర్క్ ప‌రిధి విశేషంగా పెంచుకున్న నేప‌థ్యంలో, రాష్ట్రంలోని ప్ర‌తి  ఇంటిని చేరుకోవాల‌నే ల‌క్ష్యాన్ని నిర్దేశించుకుంది మరియు వారంద‌రికీ జియో డిజిట‌ల్ లైఫ్ ప్ర‌యోజ‌నాలు అందించాల‌ని ఆకాంక్షిస్తోంది. ఆయా ప్ర‌యోజ‌నాలు ఇవి.

1. జియో వినియోగ‌దారులంద‌రికీ సాటిలేని క‌నెక్టివిటీ సౌల‌భ్యం, 4జీ నెట్‌వ‌ర్క్ యొక్క శ‌క్తివంత‌మైన మ‌రియు విస్తృత శ్రేణి నెట్ వ‌ర్క్‌తో ఉత్త‌మ సేవ‌లు.

2. జియో యొక్క అన్‌లిమిటెడ్ వాయిస్‌ మ‌రియు డాటా ప్ర‌యోజ‌నాలు

3. జియో ప్రీమియం యాప్స్ యొక్క ప్ర‌యోజ‌నాలు పొందే అవ‌కాశం, జియో టీవీ (అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన క్యాచ్ ఆప్ టీవీ యాప్‌), జియో మ్యూజిక్, జియో సినిమా స‌హా మ‌రెన్నింటినో ఆనందించవచ్చు.

4. జియో సిమ్ కార్డుల‌ను రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉంచ‌డం.

5. జియో సేవ‌ల‌ను సుల‌భంగా మ‌రియు సౌక‌ర్య‌వంతంగా పొందేలా తీర్చిదిద్ద‌డం.