న్యూఢిల్లీ: టెలికం రంగంలో సంచలనాలు నెలకొల్పుతున్న రిలయన్స్ జియో మరో నిర్ణయం తీసుకున్నది. 5జీ నెట్ వర్క్ సొల్యూషన్స్ కోసం చైనా టెలికం సంస్థలతో జత కట్టనున్నది. ఇంటరోపెరాబిలిటీ మద్దతు కోసం చైనా టెలికం సంస్థలతో కలిసి పని చేయనున్నది. అగ్రశ్రేణి టెలికం సంస్థలన్నీ కలిసి ఓపెన్ టెస్ట్ అండ్ ఇంటిగ్రేషన్ సెంటర్ (ఓటీఐసీ) ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. 

ఓపెన్ టెస్ట్ అండ్ ఇంటిగ్రేషన్ సెంటర్ (ఓటీఐసీ) ఏర్పాటు చేయడంలో చైనా మొబైల్, రిలయన్స్జ్ సంస్థలతోపాటు చైనా టెలికం, చైనా యునికామ్, ఇంటెల్, రాడిస్యాస్, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఎయిర్ స్పాన్, బైసెల్స్, సెర్టస్ నెట్, మావెనీర్, లెనెవో, రైజ్జి నెట్ వర్క్, ఇన్స్పూర్, స్య్లైన్ కాం, వైండ్ రివర్, ఆరారే కామ్, చెంగ్డు ఎన్టీఎస్ భాగస్వామి అవుతాయని జియో ఒక ప్రకటనలో తెలిపింది. 

రిలయన్స్ జియో అధ్యక్షుడు మాథ్యూస్ ఉమెన్ స్పందిస్తూ 5జీ, ఓపెన్ టెక్నాలజీలను అందుబాటులోకి తేవడానికి ఓటీఐసీతో కలిసి అభివ్రుద్ధి చేయడానికి క్రుషి చేస్తున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీ ప్రమాణాలను అమలు చేసేందుకు వేగవంతం అవుతుందన్నారు. వైర్ లెస్ టెలికం నెట్ వర్క్ సొల్యూషన్స్ కోసం బ్లూ ప్రింట్ కోసం ఓటీఐసీ అలయన్స్ పార్టనర్లను ఆహ్వానిస్తోంది.