రిలయన్స్ జియో న్యూ ఇయర్ ఆఫర్.. ఈ ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్‌తో ఆన్ లిమిటెడ్ 5జి..
ఈ ప్లాన్‌లతో లాంగ్ వాలిడిటీ ఇంకా ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఈ ప్లాన్‌లతో కంపెనీ కస్టమర్లకు 5G డేటా సౌకర్యాన్ని కూడా అందించబోతోంది.
టెలికాం కంపెనీ రిలయన్స్ జియో కొత్త సంవత్సరం సందర్భంగా కస్టమర్ల కోసం గొప్ప ఆఫర్లను తీసుకొచ్చింది. ఏంటంటే జియో రూ. 2023 అండ్ రూ. 2,999 అనే రెండు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లతో లాంగ్ వాలిడిటీ ఇంకా ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. ఈ ప్లాన్‌లతో కంపెనీ కస్టమర్లకు 5G డేటా సౌకర్యాన్ని కూడా అందించబోతోంది. ఈ ఆఫర్‌ల కింద కస్టమర్లు అదనపు వ్యాలిడిటీ ఇంకా డేటాను పొందుతారు. అంటే, మీరు దీనిని జియో ఫస్ట్ 5G రీఛార్జ్ ప్లాన్ అని కూడా పిలవవచ్చు. ఈ జియో ప్లాన్‌లతో లభించే ప్రయోజనాల గురించి తెలుసుకోండి..
జియో రూ. 2023 ప్లాన్
జియో ఈ ప్లాన్‌ను న్యూ ఇయర్ ఆఫర్ ప్లాన్‌గా పరిచయం చేసింది. జియో రూ. 2023 ప్లాన్‌తో 252 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అలాగే, ఈ ప్లాన్‌తో రోజుకు 2.5 GB డేటా సౌకర్యం ఉంటుంది. అంటే, మీరు 252 రోజుల పాటు మొత్తం 630 GB డేటా పొందుతారు. అయినప్పటికీ, డైలీ డేటా లిమిట్ ముగిసిన తర్వాత స్పీడ్ 64Kbps వద్ద ఉంటుంది, కానీ ఇప్పటికీ మీరు ఇంటర్నెట్‌కి కనెక్ట్ కావొచ్చు.
దీనితో పాటు కంపెనీ ఈ ప్లాన్‌తో ఆన్ లిమిటెడ్ 5G డేటాను కూడా అందిస్తోంది. అంటే, మీరు Jio వెల్‌కమ్ ఆఫర్ పొందితే మీకు ఆన్ లిమిటెడ్ 5G డేటా లభిస్తుంది. ప్లాన్‌తో రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లు, ఆన్ లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం కూడా ఉంది. ఈ ప్లాన్‌తో ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇందులో జియో టివి, జియో సినిమా, జియో సెక్యూరిటి, జియో క్లవ్డ్ యాప్‌ల ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉన్నాయి.
జియో రూ. 2999 ప్లాన్
జియో ఏడాది పొడవునా ప్లాన్‌తో కూడా రోజుకు 2.5 GB డేటా సౌకర్యం అందిస్తుంది. ఈ ప్లాన్‌తో 365 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అంటే, ఒకసారి రీఛార్జ్ చేసిన తర్వాత, మీరు సంవత్సరం మొత్తం రీఛార్జ్ టెన్షన్ నుండి విముక్తి పొందుతారు. Jio రూ. 2999 రీఛార్జ్ ప్లాన్‌తో ఆన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్ లు లభిస్తాయి. ఈ ప్లాన్‌తో కూడా, హై స్పీడ్ ఇంటర్నెట్ కోసం కంపెనీ 5G డేటాను అందిస్తోంది. ఇంకా జియో టివి, జియో సినిమా, జియో సెక్యూరిటి, జియో క్లవ్డ్ యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ కూడా ప్లాన్‌లో వస్తుంది.