IT Rules 2021: ఒక్క నెలలో 18.5 లక్షల అకౌంట్లను నిషేదించిన వాట్సాప్..

మీకు ఏదైనా ఖాతాకు సంబంధించి కూడా ఫిర్యాదు ఉంటే, మీరు grievance_officer_wa@support.whatsapp.com లో ఫిర్యాదు చేయవచ్చు . గత నేల ఫిబ్రవరి 2022లో కంపెనీ 14 లక్షల ఖాతాలను నిషేధించింది.

IT Rules 2021: WhatsApp banned 18.5 lakh WhatsApp accounts in March

వాట్సాప్ మరోసారి పెద్ద చర్య తీసుకుంది. కేవలం ఒక నెలలో 18.5 లక్షల ఖాతాలను నిషేధించింది. ఐటీ చట్టం 2021 ప్రకారం వాట్సాప్ ఈ చర్య తీసుకుంది. వాట్సాప్  కొత్త నివేదిక ప్రకారం, మార్చి 2022లో 18.5 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించింది. కొత్త చట్టం ప్రకారం, కంపెనీ ప్రతి నెలా వినియోగదారుల భద్రతా నివేదికలను జారీ చేస్తుందని వివరించింది.

మార్చి 1 నుండి మార్చి 31 2022 మధ్య పాలసీ ఉల్లంఘనలు, స్పామ్‌లపై WhatsApp చర్య తీసుకుంది. నివేదిక ప్రకారం, అక్కౌంట్ సపోర్ట్ పై వినియోగదారులు 597 ఖాతాలపై ఫిర్యాదు చేశారు, వాటిలో 407 ఖాతాలను నిషేధించాలని డిమాండ్ చేశారు. ప్రాడక్ట్ సపోర్ట్ కి సంబంధించి 37 ఫిర్యాదులు, భద్రతకు సంబంధించి 13, ఇతర సంబంధించి 28 ఫిర్యాదులు అందాయి. 

మీకు కూడా ఏదైనా ఖాతాకు సంబంధించి ఫిర్యాదు ఉంటే, మీరు grievance_officer_wa@support.whatsapp.com లో ఫిర్యాదు చేయవచ్చు . ఫిబ్రవరి 2022లో కంపెనీ 14 లక్షల ఖాతాలను నిషేధించింది.

WhatsApp ఇప్పుడు ఫోన్‌ల కోసం మల్టీ-డివైజ్ కి  సపోర్ట్ విడుదల చేయబోతోంది. అంటే, కొత్త అప్‌డేట్ తర్వాత మీరు  స్మార్ట్‌ఫోన్‌లలో ఒకే WhatsApp ఖాతాను ఉపయోగించగలుగుతారు. ప్రస్తుతానికి, ఒక మొబైల్‌లో మాత్రమే ఒక ఖాతాను ఉపయోగించవచ్చు.

WABetaInfo నివేదిక ప్రకారం, ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.22.10.13లో కొత్త ఫీచర్ కనిపించింది. కొత్త ఫీచర్  స్క్రీన్‌షాట్ కూడా వెల్లడైంది, దీనిలో మల్టీ ఫోన్‌లలో ఒకే ఖాతాను తెరవడానికి ఆప్షన్ చూడవచ్చు. కొత్త అప్‌డేట్ తర్వాత, వినియోగదారులు డివైజ్ కంపానియన్‌గా రిజిస్టర్ చేసుకునే ఆప్షన్ పొందుతారు, దానిపై క్లిక్ చేయడం ద్వారా మీరు ఇతర ఫోన్‌లలో కూడా అదే ఖాతాను తెరవవచ్చు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios